Ads
ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది కంటి సమస్యలతో బాధపడుతున్నారు. కంటి సమస్యలు ఉండకుండా ఉండాలంటే మంచి పోషక పదార్థాలు తీసుకోవాలి. ఈ పోషకపదార్థాలను కనుక మీరు డైట్ లో తీసుకుంటే కచ్చితంగా కంటి సమస్యలకు దూరంగా ఉండొచ్చు.
Video Advertisement
పైగా మీ కంటి చూపు మెరుగుపడుతుంది కూడా. అయితే మరి కంటి చూపు మెరుగుపడాలంటే ఎటువంటి ఆహార పదార్థాలను తీసుకోవాలి..?, ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం.
చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు కంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఎక్కువగా స్క్రీన్లకు దగ్గరవ్వడం వల్ల కంటి సమస్యలు మరింత ఎక్కువ అవుతున్నాయి. అయితే ఇటువంటి బాధలు పడకుండా ఉండాలంటే డైట్ లో వీటిని యాడ్ చేసుకుంటే సరి. లేదంటే కళ్ళజోడు రావడం మొదలు చాలా ఇబ్బందులు కలుగుతాయి.
#1. విటమిన్ సి:
నిమ్మ, నారింజ, బొప్పాయి, టమాటాలలో విటమిన్ సి ఉంటుంది. విటమిన్ సి సమృద్ధిగా వుండే ఆహారపదార్ధాలను తీసుకుంటే కంటి సమస్యలకు దూరంగా ఉండచ్చు. కంటిశుక్లం రిస్క్ తగ్గుతుంది.
#2. లుటీన్ మరియు జియాక్సంతిన్:
ఇవి ఎక్కువగా మనకు బ్రోకలీ, జొన్న మరియు బఠాణీలలో దొరుకుతుంది. వీటిని ఎక్కువగా తీసుకోవడం వలన కంటి సమస్యలకు దూరంగా ఉండచ్చు. కంటి సమస్యలు రాకుండా ఉండాలంటే రెగ్యులర్ గా తీసుకుంటూ వుండండి.
#3. ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్:
వీటి వలన కూడా కంటి ఆరోగ్యం బాగుంటుంది. ట్యూనా, సాల్మన్ వంటి వాటిలో ఇది పుష్కలంగా ఉంటుంది.
#4. విటమిన్ ఈ:
విటమిన్ ఈ కూడా కంటి ఆరోగ్యానికి ఎంతో అవసరం. ఫ్రీ రాడికల్స్ నుంచి మన కళ్ళని కాపాడుతుందిది. చిలగడదుంపలు లో ఇది ఉంటుంది. అలానే వెజిటేబుల్ ఆయిల్స్ లో ఉంటుంది.
#5. జింక్:
జింక్ వలన కూడా కంటి ఆరోగ్యం బాగుంటుంది. జింక్ తక్కువ ఉంటే రేచీకటి, కంటిశుక్లం వంటి సమస్యలు ఎదురవుతాయి. గింజలు కూడా ఎక్కువ తీసుకుంటే జింక్ ని పొందొచ్చు. ఇలా కంటి సమస్యలకు దూరంగా ఉండచ్చు.
End of Article