ఆధార్ కార్డు లో ఆ చిన్న మిస్టేక్.. ఆ బామ్మ పాలిట శాపమైంది.. అసలేమైందంటే?

ఆధార్ కార్డు లో ఆ చిన్న మిస్టేక్.. ఆ బామ్మ పాలిట శాపమైంది.. అసలేమైందంటే?

by Anudeep

Ads

ఆధార్ కార్డు ను భారత పౌరుల గుర్తింపు కోసం రూపొందించిన సంగతి తెలిసిందే. పౌరుల గుర్తింపు కార్డు.. అన్ని ప్రభుత్వ పధకాల లబ్ది కి ఈ కార్డు తప్పని సరి గా ఉండాల్సిందే. అయితే.. డిజిటల్ గానో.. లేక ప్రభుత్వ ఉద్యోగుల పొరపాట్ల కారణం గానో కార్డు ముద్రణ లో జరిగే దోషాలు సామాన్యుల పాలిట శాపాలవుతున్నాయి. ఓ ఆధార్ కార్డు లో జరిగిన పొరపాటు ఓ బామ్మ పాలిట శాపమైంది.

Video Advertisement

bamma 1

పూర్తి వివరాల్లోకి వెళితే, అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణానికి చెందిన గాంధీ చౌక్ ఏరియా లో షేక్ అమ్మి నబి అనే బామ్మ గత యాభై ఏళ్లుగా అదే స్థలం లో నివాసం ఉంటున్నారు. ముప్పై సంవత్సరాల క్రితం ఆమె భర్త మరణించాడు. ఉన్న నగదు ను సరిపెట్టి కూతురికి పెళ్లి చేసింది. ఆ తరువాత నుంచి..దాదాపు ఇరవై సంవత్సరాలు గా పెన్షన్ పైనే ఆధారపడి జీవిస్తోంది.

bamma 3

మొదట్లో రెండు వందల రూపాయల పెన్షన్ వచ్చేది. ఆ తరువాత చంద్రబాబు నాయుడు హయాం లో రెండువేల నగదు, ప్రస్తుతం రెండువేల రెండొందల యాభై రూపాయల పెన్షన్ తో ఆమె బతుకుని వెళ్లదీస్తోంది. ఉన్నట్లుండి.. గత రెండు నెలలు గా ఆమెకు పెన్షన్ రావడం ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయిందో చెప్పాలంటూ ఆమె అధికారులను నిలదీసింది.

bamma 4

అయితే, అధికారులు ఆమె ఆధార్ ప్రూఫ్ ని పరిశీలించి.. మీ వయసు ప్రభుత్వ రికార్డు లలో కేవలం పదహారేళ్లు ఉందని చెప్పారు. ఆధార్ కార్డు తో పాటు.. వారి రికార్డ్స్ లో 16 సంవత్సరాల వయసు ఉండడం వల్లే పెన్షన్ ఆగిపోయిందని చెప్పారు. దీనితో ఆ బామ్మ షాక్ అయింది. ఇరవై ఏళ్ళు గా పెన్షన్ ఇస్తూ..ఇప్పుడు ఈ కారణం తో పెన్షన్ ను ఆపేయడం అన్యాయం అని ఆ బామ్మ ఆవేదన చెందుతోంది. వయసు మార్చమని అడిగిన.. అందుకు ఆధారాలు ఇవ్వాలని అడుగుతుండడం తో.. ఆమెకు ఏమి చేయాలో పాలుపోవడం లేదు. ఎవరో చేసిన తప్పు.. ఆమె పాలిట శాపమైంది. ఆమె ఆధార్ లో వయసు తప్పు ఉండడం వల్లనే ఆమెకు ఇన్ని ఇక్కట్లు ఎదురయ్యాయి.

Watch Video:


End of Article

You may also like