కోట్లకు అధిపతి అయినా.. పేదల కడుపు నింపడంలోనే సంతృప్తి: మట్కామ్యాన్

కోట్లకు అధిపతి అయినా.. పేదల కడుపు నింపడంలోనే సంతృప్తి: మట్కామ్యాన్

by Anudeep

Ads

క్యాన్సర్ జీవితాన్ని కబళించే ఓ మహమ్మారి. ఎన్నో శస్త్ర చికిత్సలు చేస్తే కానీ నయం కాదు. అందులోనూ అందరికి సర్జరీ సక్సెస్ అవుతుందన్న నమ్మకం కూడా ఉండదు.

Video Advertisement

ఇలాంటి పరిస్థితుల్లో ఆ వ్యక్తి ఎంతో ధైర్యంగా ఉండాలి. చుట్టూ తన వాళ్ళు అండగా ఉండాలి. కానీ ఇందుకు భిన్నంగా ఓ 73 ఏళ్ల వృద్ధుడు ఎంతో మంది పేదలకు అన్నం పెడుతూ మీకు నేనున్నాను అన్న భరోసానిస్తున్నాడు.

వివరాల్లోకి వెళ్తే..
కోట్ల రూపాయల ఆస్తి ఉండి, విదేశాల్లో విలాసవంతమైన జీవితం గడిపే అవకాశం ఉన్నా ఆయన వాటన్నింటినీ వదిలేశాడు. దేశ రాజధాని ఢిల్లీకి వచ్చి ఎంతో మంది నిరుపేదల కడుపు నింపుతున్నాడు. అప్పుడప్పుడు చేసే అన్నదానం కాకుండా రోజూ 250 మందికి పైగా పేదలకు అన్నం పెడుతున్నాడు. అదికూడా పోషకాలతో కూడుకున్నది.

ఇన్ని చేస్తున్న ఆ దానకర్ణుడికి కేన్సర్. 73 ఏళ్ల వయసులో ఓ వైపు వయోభారం, మరో వైపు జీవితాన్ని కబళించే క్యాన్సర్. మహమ్మారితో పోరాడుతూనే పేదలకు నిరంతరం ఆహారం అందిస్తున్నాడు. ఇలా పేదల కడుపు నింపి, వారి సంతోషంలోనే తన ఆనందాన్ని వెతుక్కుంటున్నాడాయన.

ఢిల్లీకి చెందిన నటరాజన్ (73) అత్యంత ధనికుడు. దాదాపు 30 ఏళ్ల పాటు లండన్‌లో నివాసం ఉండి బాగా డబ్బు సంపాదించాడు. ఎంత సంపాదించినా పేదలకు సేవ చేయడంలోనే సంతృప్తి ఉందని ఆయన గ్రహించాడు.

వెంటనే ఢిల్లీకి తిరిగి వచ్చి దక్షిణ ఢిల్లీలోని ధనికులు నివసించే పంచశీల్ ప్రాంతంలో తన సేవా కార్యక్రమాలను ప్రారంభించారు.
అక్కడికి పనుల నిమిత్తం వచ్చే పేదలు, కూలీల కోసం తొలుత స్వచ్ఛమైన నీటిని అందించే వాడు. ఆ తర్వాత రుచికరమైన, పోషకాహారాన్ని అందించడం ప్రారంభించాడు.

ఆయన్ని మట్కామ్యాన్’ అని స్థానికులంతా ప్రేమగా పిలుచుకుంటారు. ఆయన చేసే ఈ సేవా కార్యక్రమాలకు అతని భార్య కూడా సహకారం అందిస్తుంది. రోజూ మధ్యాహ్నం ఫైవ్ స్టార్ హోటళ్లను తలదన్నేలా ఆహారం పెడుతుంటాడు. ఆహారంతో పాటు పండ్లు, లస్సీ, పళ్ల రసాలు అందిస్తున్నాడు. ఇది తెలిసిన వారెవరైనా మట్కామ్యాన్‌ సేవలను కొనియాడకుండా ఉండలేరు.


End of Article

You may also like