డెస్టినీ ఎటు తీసుకు వెళ్తుందో ఎవ్వరం చెప్పలేము. సినిమా పాత్రల విషయం లో కూడా అంతే. ఎప్పుడు ఎలాంటి పాత్రలు వస్తాయో తెలియదు. ఏ క్యారెక్టర్ తో తిరిగి మరో సినిమా లో నటిస్తామో కూడా ఊహించడం కష్టమే. అలా.. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సినిమా లో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసి.. తరువాత హీరోయిన్ అయ్యాక మహేష్ బాబు కె విలన్ గా నటించింది ఒకప్పటి హీరోయిన్ రాశి.

mahesh and rasi

సూపర్ స్టార్ మహేష్ బాబు, ఒకప్పటి హీరోయిన్ రాశి చైల్డ్ ఆర్టిస్ట్ లు గానే తమ కెరీర్ ను ప్రారంభించారు. మహేష్ బాబు చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించే సమయానికి సూపర్ స్టార్ కృష్ణ మంచి ఫామ్ లో ఉన్నారు. కృష్ణ గారి సినిమాల్లో కూడా మహేష్ బాబు చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు. అలా 1989 లో తెరకెక్కిన “గూఢ‌చారి 117” సినిమాలో ప్రిన్స్ మహేష్ బాబు చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు.

అదే సినిమాలో హీరోయిన్ రాశి కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. ఈ సినిమాలో వారిద్దరి మధ్య సన్నివేశాలు ఏమి ఉండవు. అయితే వారు అప్పటికి ఉహించి ఉండరు తిరిగి వారిద్దరూ కలిసి హీరో-విలన్ గా నటిస్తారని. అదే మరి డెస్టినీ అంటే. తరువాత కాలం లో ఇద్దరు పెద్ద అయ్యాక హీరో, హీరోయిన్లు అయ్యారు. రాశి కూడా అప్పటికే స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చేసుకుంది.

మహేష్ బాబు కూడా వరుస సినిమా లతో హీరో గా బిజీ అయ్యాడు. 2003 లో “మహేష్ బాబు” హీరోగా తేజ తెరకెక్కించిన “నిజం” సినిమా లో రాశి విలన్ గా నటించారు.

ఈ సినిమా లో గోపీచంద్ ప్రధాన విలన్ గా నటించారు. గోపీచంద్ భార్య గా రాశి కూడా విలన్ గానే ఈ సినిమా లో కనిపిస్తారు. అప్పటికే స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న రాశి విలన్ గా కూడా నటించింది.