ఈ విలన్ ని గుర్తుపట్టారా..? బాలకృష్ణ “అశోక చక్రవర్తి” సినిమా తో తెలుగు ప్రేక్షకులకు విలన్ గా పరిచయం అయ్యాడు. ఆయన పేరు శరత్ సక్సేనా.. వాస్తవానికి ఈయన బాలీవుడ్ నటుడు. అయినప్పటికీ.. తెలుగు లో కూడా విలన్ గా మంచి పేరు తెచ్చుకున్నాడు. నాగార్జున సినిమా “నిర్ణయం లో కూడా శరత్ విలన్ గా నటించారు. కానీ ఈ సినిమాలు అంత గా పేరు తెచ్చిపెట్టలేదు.

sarath saxena 1

ఆ తరువాత వరుస గా మెగాస్టార్ సినిమాల్లో విలన్ గా నటించారు. ఈయన విలన్ గా నటించిన సినిమాల్లో “ముఠా మేస్త్రి”, “ఘరానా మొగుడు”, “ముగ్గురు మొనగాళ్లు”, “ఎస్పీ పరశురామ్” సినిమాలు మంచి పేరు తెచ్చి పెట్టాయి. ఆ తరువాత ఎన్టీఆర్ “సింహాద్రి” లో ఈయన చేసిన పాత్ర ఇప్పటికి అందరికి గుర్తుండిపోయింది. “బన్నీ” మూవీ లో కూడా సపోర్టింగ్ రోల్ చేసి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గర అయ్యాడు. ఆ తరువాత టాలీవుడ్ లో సినిమాలను తగ్గించారు.

sarath saxena 2

ప్రస్తుతం శరత్ సక్సేనా ఎక్కువ గా తమిళ్, హిందీ చిత్రాలలో నటిస్తున్నారు. సోషల్ మీడియా లో మాత్రం ఆక్టివ్ గానే ఉన్న శరత్ తన ఫోటోస్ అప్ లోడ్ చేస్తూ ఉంటారు. ప్రస్తుతం డెబ్బయ్యవ ఒడికి చేరినా.. ఈ విలన్ ఫోటో లు చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. నేటి తరం హీరోలకు ధీటు గా ఫిజిక్ ని మైంటైన్ చేస్తున్నారు. ఈ లుక్స్ ని చూస్తే ఔరా అనిపించక మానదు.