1963 నాటి “పెట్రోల్ బిల్” చూశారా..? ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

1963 నాటి “పెట్రోల్ బిల్” చూశారా..? ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

by Harika

Ads

గత కొన్ని రోజులుగా ఇంటర్నేషనల్ మార్కెట్‌లో ముడి చమురు వెల ఎల్లప్పుడు హెచ్చుతగ్గులకు లోనవుతోంది. ఆగస్టు నుంచి ముడి చమురు ధర తగ్గిన తరువాత నవంబర్ నుండి పెట్రోల్ ధర పెరుగుతోంది. ఆయిల్‌ కంపెనీలు నిత్యం ఉదయం 6 గంటలకు పెట్రోల్ ధరలను రిలీజ్ చేస్తుంటాయి.

Video Advertisement

ప్రస్తుతం లీటరు పెట్రోలు ధర రూ.96 నుండి రూ.108 మధ్య విక్రయిస్తున్నారు. ఇంతలా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలతో ప్రజలు కుదేలవుతున్నారు.  అయితే 1963 లోని పెట్రోల్ బిల్ కు సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఎడతెగకుండా పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం దేశవ్యాప్తంగా వినియోగదారులను ఆందోళనకు గురిచేస్తోంది. పెట్రోలు ధర రూ.96 – 108 మధ్య విక్రయిస్తుండగా, డీజిల్ రూ.94 నుంచి రూ.100 మధ్య విక్రయిస్తున్నారు. హైదరాబాద్ లో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ రూ.  109.66 కి విక్రయిస్తున్నారు. ఇక ఇంధన ధరలు పెరగడం వెనుక అనేక కారణాలున్నాయి. కానీ, ప్రస్తుత ధర సామాన్యుడి వెన్ను విరిచే స్థాయికి చేరి, వినియోగదారుల జేబులకు చిల్లులు పెడుతోంది.
కొన్నేళ్ల నుంచి పెట్రోలు ధర ఎక్కువగానే ఉన్నా, కొన్ని దశాబ్దాల క్రితం దాని ధర చాలా తక్కువ. 1963లో పెట్రోల్ లీటరుకు 72 పైసలకు అమ్మినట్టు ఒక పాత బిల్లు ద్వారా తెలుస్తోంది. ఆ విషయాన్ని నమ్మలేకపోతున్నారు. 1963లో ఫిబ్ర‌వ‌రి 2 కు సంబంధించిన పెట్రోల్  బిల్లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. ఆ బిల్లు భారత్ పెట్రోల్ సప్లై కో నుండి వచ్చింది. ఇది సీరియల్ నంబర్ ‘7560’ కలిగి ఉన్న ఫిల్లింగ్ స్టేషన్. ఐదు లీటర్ల  పెట్రోల్‌కు మొత్తం రూ. 3.60.  అంటే ఒక లీటర్ పెట్రోల్ ధర కేవలం 72 పైసలు మాత్రమే. ఈ బిల్లు చూసిన నెటిజెన్లు తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు.
ఒక నెటిజెన్ “60వ దశకంలో మధ్యతరగతి వారి జీతం దాదాపు 50-100 రూపాయలు. నేడు ఆ జీతం దాదాపు 50 వేల నుండి లక్ష రూపాయల వరకు ఉంది. భారీ దిగుమతులు మరియు చాలా తక్కువ ఎగుమతులు చేయడం వల్ల రూపాయి పతనమైంది” అని కామెంట్ చేశాడు.

Also Read: ఈ రెండు ఫోటోల మధ్య రెండు తేడాలు ఉన్నాయి…అవి ఏంటో కనిపెట్టగలరా.?


End of Article

You may also like