Ads
మనకి భారతదేశంలో రకరకాల స్వీట్లు దొరుకుతూ ఉంటాయి. ఒక్కొక్క చోట ఒక్కొక్క స్వీట్ బాగా స్పెషల్. అయితే మాడుగుల గ్రామంలో స్పెషల్ స్వీట్ ఏంటంటే హల్వా. మాడుగుల హల్వా అంటే చాలామందికి తెలుసు ఈ పేరు వినే ఉంటారు. ఈ హల్వాను తినే ఉంటారు. అయితే మాడుగుల హల్వాను శోభనం స్పెషల్ హల్వా అంటారు. ఆ రాత్రి స్పెషల్ గా ఈ హాల్వాను ఆర్డర్ చేసుకొని మరి తెప్పించుకుంటారట.
Video Advertisement
అయితే ఒకసారి మాడుగుల హల్వా బ్యాక్ స్టోరీ కి వెళ్తే…దాదాపు 140 ఏళ్ల క్రితం మాడుగుల గ్రామానికి చెందిన దంగేటి ధర్మారావు అనే వ్యక్తి మిఠాయిల వ్యాపారాన్ని ప్రారంభించారు. దీంతో ఏదైనా కొత్తగా ఒక స్వీట్ తయారీ చేయాలనే ఆలోచన ఆయనకి వచ్చింది. ఆ ఆలోచనలో నుంచి పుట్టిందే ఈ మాడుగుల హల్వా. దీనిని తయారు చేసేందుకు 4 రోజుల సమయం పడుతుంది.
ముందుగా గోధుమలను 3 రోజులు నానబెట్టి రోటిలో రుబ్బి గోధుమ పాలు సేకరిస్తారు. గోధుమ పాలను ఒక రోజు పులియబెట్టి పంచదార, ఆవు నెయ్యి కలిపి దగ్గరకు మరిగే వరకు ఇనుప కళాయిలో తిప్పుతారు. ఆ పాకాన్ని దించి దానిపై బాదం, జీడిపప్పు వేస్తారు. ఇంత ప్రాసెస్ చేసాక వచ్చేది మాడుగుల హల్వా. ఇందులో అసలు సంగతి ఏంటంటే కట్టెల పొయ్యి మీద మాత్రమే ఈ పాకం పడతారు. ఇలా చేసిన హల్వా నెల రోజుల వరకు పాడవకుండా ఉంటుందని నిర్వాహకులు చెప్తున్నారు. ముఖ్యం పాకం కరెక్ట్‌గా వచ్చింద లేదా అని చెప్పడమే ఈ హల్వా తయారీలో కీలకమంటున్నారు. చాలా అనుభవం ఉన్నవారు మాత్రమే ఈ పాకం దగ్గర ఉండాలంటున్నారు.
శోభనం రోజు రాత్రి ఈ హల్వాను తింటే పడక గదిలో రెచ్చిపోతారని అంటారు. అంతేకాకుండా బాలింతలకు కూడా ఈ హాల్వా చాలా మంచిదట.సాధారణ ప్రజల నుంచి సెలెబ్రెటీలు, సినీరంగానికి చెందినవారు, రాజకీయనాయకుల ఈ మాడుగుల హల్వాను ఇష్టంగా తింటారు. దీని రేట్ కిలోకు రూ.400 నుంచి 600 ఉంటుంది. హైదరాబాద్, చెన్నై, బెంగళూరులాంటి ప్రధాన నగరాలతో పాటు విదేశాలకు కూడా ఈ హల్వాను పార్శిల్ చేస్తారు. 1500 కుటుంబాలు ఈ హల్వా తయారీపై ఆధారపడి ఉపాధి పొందుతున్నారు.
End of Article