“ఆస్కార్” అనే పేరు వెనుక ఇంత చరిత్ర ఉందా..? ఈ అవార్డ్ ని ఎలా చేస్తారు అంటే..?

“ఆస్కార్” అనే పేరు వెనుక ఇంత చరిత్ర ఉందా..? ఈ అవార్డ్ ని ఎలా చేస్తారు అంటే..?

by Megha Varna

Ads

ఇప్పుడు ఎక్కడ విన్నా ఆస్కార్ పదం ఎక్కువగా వినపడుతోంది. ఆస్కార్ అవార్డు నాటు నాటు పాట కి రావాలని మన దేశంలో ఉన్న వారంతా కూడా కోరుకున్నారు. చాగంటి కోటేశ్వరరావు గారు కూడా ఆస్కార్ అవార్డు నాటు నాటు పాటకి రావాలని మనం ఆ దేవుడిని ప్రార్థిద్దాం… గుడికి వెళ్ళినప్పుడు మీరు కూడా కోరుకోండి అని అన్నారు. అయితే అసలు ఆస్కార్ అవార్డు దేనితో చేస్తారు అనే సందేహం చాలా మందిలో ఉంది.

Video Advertisement

పైగా దానికి ఎందుకంత విలువ అని కూడా చాలా మందిలో కలుగుతున్న ప్రశ్న. ప్రపంచ సినీ పరిశ్రమలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డు ఆస్కార్ అవార్డు.

the story behind RRR 'natu natu' song..!!

నటులు అంతా కూడా ఆస్కార్ కోసం కలలు కంటారు. ఒక్కసారైనా ఆస్కార్ తెచ్చుకోవాలని దాని కోసం ఎంత శ్రమించాలో అంత శ్రమిస్తారు. ఈసారి తెలుగు చిత్ర పరిశ్రమ నుండి బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో దర్శక ధీరుడు రాజమౌళి తీసుకువచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా నుండి నాటు నాటు పాట నామినేట్ అయింది ఈ విషయం మనకి తెలిసిందే.

ఎందుకు ఆస్కార్ అనే పేరు..

మొదటి సారి ఈ అవార్డు ని అకాడమీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మార్గరెట్ హెర్రిక్ చూసి.. ఆ అవార్డు లో యోధుడు తన అంకుల్ ఆస్కార్ లాగే ఉన్నాడని అన్నారు. తర్వాత హాలీవుడ్ కాలమిస్ట్ సిడ్నీ స్కోల్ స్కీ ఓ వ్యాసంలో ఆస్కార్ అవార్డ్స్ అని రాశారట. ఇలా ఆ పేరు వచ్చింది.

ఆస్కార్ వెనుక ఉన్నచరిత్ర:

ఎంజీఎం స్టూడియో ఆర్ట్ డైరెక్టర్ కెడ్రిక్ గిబ్బన్స్ సృషించడం జరిగింది. ఆస్కార్ అవార్డు ఒక యోధుడు రెండు చేతులతో వీర ఖడ్గం పట్టుకుని ఫిల్మ్ రీలుపై నిలబడినట్టు ఉంటుంది. రీలు లో ఐదు చువ్వలు లాగ ఉంటాయి. ఈ ఐదు అకాడమీలోని ఐదు భాగాలని సూచించినట్టు. ఈ అవార్డు ని నటుడు ఎమిలో ఫెర్నాండెజ్ ని నగ్నంగా నిలబెట్టి తన ఆకారం నుంచి తీసుకొచ్చారు. ఈ కారణంగానే ఆస్కార్ అవార్డు నగ్నంగా ఉంటుంది.

ప్రసిద్ధ శిల్ప జార్జ్ స్టాన్లీ దీన్ని చేసారు. వీళ్లది లాస్ ఏంజిల్స్. ఈ అవార్డు ని అంతా బంగారం తో చెయ్యరు. 13.5 అంగుళాల ఎత్తు ఉంటుంది ఇది. 450 గ్రాముల పైగా దీని బరువు ఉంటుంది.24 క్యారెట్ల బంగారు పూత అద్ది దీన్ని చేస్తారు. ఒక అవార్డు కోసం సుమారు 1000 డాలర్లకు పైగా అవుతుంది. అవార్డ్ విలువ ఒక డాలర్ మాత్రమే. కానీ ఈ అవార్డుని అమ్మకూడదు.


End of Article

You may also like