పులిని చూసి నక్క వాతలు పెట్టుకోడం అంటే ఇదే అనుకుంటా.? టాలీవుడ్ ని చూసి ఆ రెండు ఇండస్ట్రీలు.?

పులిని చూసి నక్క వాతలు పెట్టుకోడం అంటే ఇదే అనుకుంటా.? టాలీవుడ్ ని చూసి ఆ రెండు ఇండస్ట్రీలు.?

by Anudeep

Ads

ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ చిత్రాలే. వాటి భారీతనం ముందు మన దక్షిణాది సినిమాలు తేలిపోయేవి. పైగా హిందీ చిత్రాలకు అంతర్జాతీయ మార్కెట్ ఉండేది. ఇప్పుడు దానిని అధిగమిస్తూ సౌత్ సినిమా సాగుతోంది. సౌత్ సినిమా అంటే ప్రస్తుతం తెలుగు సినిమానే. బాహుబలి సినిమాతో ఇండియన్ సినిమాను శాసించే స్థాయికి తెలుగు సినిమాను తీసుకెళ్లాడు రాజామౌళి. ఇక ఇటీవలే వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాతో మరోసారి ట్రెండ్ సెట్ చేసారు ఆయన.

Video Advertisement

other indutries trying to beat bahubali..??
ఇక జక్కన్న బాహుబలిని ఎప్పుడు అయితే తెరకెక్కించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడో అప్పటి నుండి ఇటు కోలీవుడ్ అటు బాలీవుడ్ ఇండస్ట్రీలు బాహుబలిని మించి విజయం సాధించాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ రెండు ఇండస్ట్రీల నుండి బాహుబలి తర్వాత భారీ బడ్జెట్ తో భారీ సెట్టింగులతో సినిమాలను పోటీగా దింపారు. కానీ ఒక్కటంటే ఒక్క సినిమా కూడా బాహుబలి స్థాయిని కాదు కదా.ఆ సినిమాలు దరిదాపుల్లో కూడా చేరలేక పోయాయి.

other indutries trying to beat bahubali..??
బాహుబలి భారీ విజయం తర్వాత కోలీవుడ్ లో పులి సినిమాను పోటీగా రిలీజ్ చేసారు.ఈ సినిమాలో విజయ్ హీరోగా నటించాడు.130 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా విజయ్ క్రేజ్ వల్ల కాస్త కలెక్షన్స్ సాధించింది కానీ లేకపోతే మరింత ఘోరంగా విఫలం అయ్యింది.ఆ తర్వాత బాలీవుడ్ కూడా ఇదే పంథాలో కలంక్ సినిమాను రిలీజ్ చేయగా బాలీవుడ్ కు బిగ్ షాక్ ఇచ్చింది.

other indutries trying to beat bahubali..??
ఇక పృథ్వీరాజ్, రీసెంట్ గా వచ్చిన బ్రహ్మాస్త్ర సినిమాల పరిస్థితి కూడా వీటికి భిన్నంగా ఏం లేదు. ఇక ఇప్పుడు కోలీవుడ్ ప్రెస్టీజియస్ గా తీసుకుని రిలీజ్ చేసిన పొన్నియన్ సెల్వన్ కూడా కోలీవుడ్ కు ఊహించని షాక్ ఇచ్చింది.బాహుబలి స్థాయిలో ఆకట్టు కోవాలని చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయనే చెప్పాలి.

other indutries trying to beat bahubali..??
మణిరత్నం తెరకెక్కించిన ఈ సినిమా దారుణంగా విఫలం అయ్యిందనే చెప్పాలి.సెప్టెంబర్ 30న గ్రాండ్ గా రిలీజ్ అయినా ఈ సినిమా దారుణమైన టాక్ తెచ్చుకోవడంతో మరోసారి ఎదురు దెబ్బ తప్పలేదు. తమిళం లో ఈ సినిమా పర్వాలేదు అనిపించినా.. మిగతా భాషల్లో మంచి టాక్ ను మిస్ అయ్యింది. దీంతో ఈ రెండు ఇండస్ట్రీల పరిస్థితి పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు ఉంది అని చాలా మంది ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


End of Article

You may also like