2023 సంక్రాంతి సీజన్ లోనూ రొటీన్ స్టఫ్ తోనే సినిమాలొచ్చాయి. టాలీవుడ్ అండ్ కోలీవుడ్ స్టార్ హీరోలు ఫార్ములా బేస్ట్, హీరో బేస్డ్ స్టోరీస్ తోనే ఫ్యాన్స్ ను ఎంటర్టైన్ చేశారు. పండగకి ఎలాంటి చిత్రం వచ్చినా హిట్ అవ్వుద్దని మరోసారి నిరూపించారు స్టార్ హీరోలు. ఈ సంక్రాంతికి చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’, బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’, అజిత్ ‘తునివు’, విజయ్ ‘వారసుడు’ సినిమాలు భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకి వచ్చాయి. వీటితో పాటు సంతోష్ శోభన్ హీరోగా వచ్చిన ‘కళ్యాణం కమనీయం’ కూడా ప్రేక్షకుల ముందుకి వచ్చింది.
Video Advertisement
అయితే విడుదలైన అన్ని చిత్రాలు ఇప్పటికే బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ సృష్టించాయి. అయితే ఈ చిత్రాలన్నీ థియేటర్లలో సక్సెఫుల్ గా దూసుకుపోతున్నాయి. అయితే ఇప్పుడు ఈ చిత్రాలన్నీ ఇప్పటికే తమ ఓటీటీ డేట్స్ ని ఫిక్స్ చేసుకున్నారు. ఇప్పుడు ఏయే చిత్రాలు ఏ ఓటీటీలోకి, ఎప్పుడు రాబోతున్నాయి ఇప్పుడు చూద్దాం..
#1 వీరసింహ రెడ్డి
గోపీచంద్ మలినేని, బాలయ్య కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై యలమంచిలి రవి, నవీన్ యెర్నేని నిర్మించారు. ఈ మూవీలో శృతి హాసన్ హీరోయిన్ కాగా.. వరలక్ష్మీ శరత్ కుమార్, దునియా విజయ్ వంటి స్టార్లు కూడా కీలక పాత్రలను పోషించారు.
డిస్నీ ప్లస్ హాట్ స్టార్ బాలయ్య వీరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన స్ట్రీమింగ్ రైట్స్‌ను దక్కించుకున్నారు. ఫిబ్రవరి 15 నుంచి ఈ చిత్రం ఓటీటీ లోకి వచ్చే అవకాశం ఉంది.
#2 వాల్తేరు వీరయ్య
మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య చిత్రానికి బాబీ కొల్లి దర్శకుడు. ఈ మూవీ లో చిరు వింటేజ్ లుక్, మేనరిజమ్స్, కామెడీ వర్కవుట్ అయ్యాయి. సెకండాఫ్ లో రవితేజ సినిమాను నిలబెట్టాడు.
ఈ చిత్రం డిజిటల్ రైట్స్ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ చిత్రం ఫిబ్రవరి 27 నుంచి ఈ చిత్రం ఓటీటీ లోకి వచ్చే అవకాశం ఉంది.
#3 కళ్యాణం కమనీయం
సంతోష్ శోభన్ హీరోగా వచ్చిన కళ్యాణం కమనీయం చిత్రం ఈ సంక్రాంతికి పెద్ద సినెమాలహో పాటు బరిలో నిలిచింది. ఈ చిత్రం లో ప్రియా భవాని శంకర్ హీరోయిన్. ఈ చిత్రం ఫిబ్రవరి మొదటి వారం లో ఓటీటీ లోకి వచ్చే అవకాశం ఉంది. ఈ చిత్రం రైట్స్ ఆహా దక్కించుకున్నట్లు సమాచారం.
#4 తునివు
అజిత్ కు తెలుగు లో కూడా మంచి పాపులారిటీ ఉండటం తో ఆయన ప్రతి సినిమా తెలుగులో కూడా రిలీజ్ అవుతాయి. హెచ్.వినోద్ తెరకెక్కించిన తునివు (తెగింపు) చిత్రం తో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. తునివులో మంజు వారియర్ కీలక పాత్రలో నటిస్తోంది.
బ్యాంకు రోబెరీ నేపథ్యం లో వచ్చిన ఈ యాక్షన్ డ్రామా మూవీ నెట్ ఫ్లిక్స్ లో ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. ఫిబ్రవరి 5 నుంచి ఈ చిత్రం ఓటీటీలోకి రానుంది.
#5 వారసుడు
దళపతి విజయ్, రష్మిక మందన్న జంటగా నటించిన సినిమా ‘వారిసు’. ఈ చిత్రానికి వంశి పైడిపల్లి దర్శకత్వం వహించగా.. దిల్ రాజు నిర్మించారు. ఈ చిత్రం కలెక్షన్ల విషయంలో తెలుగులో కాస్త వెనుకబడినా తమిళ్ లో మాత్రం దూసుకుపోతోంది.
ఈ చిత్రం డిజిటల్ రైట్స్ ప్రైమ్ వీడియో దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం ఫిబ్రవరి 10 నుంచి ఈ చిత్రం ఓటీటీ లోకి వచ్చే అవకాశం ఉంది.