లాస్ ఏంజిల్స్ వేదిక‌గా 95వ ఆస్కార్ అవార్డుల ప్ర‌దానోత్సవ కార్య‌క్ర‌మం ముగిసింది. ఆర్ఆర్ఆర్ మూవీలోని నాటు నాటు సాంగ్ ఆస్కార్ విజేతగా నిలిచింది. వేడుకల్లో రాజ‌మౌళి, ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్‌, కీర‌వాణి, రాహుల్ సిప్లిగంజ్‌, కాల భైర‌వ‌, ప్రేమ్ ర‌క్షిత్ త‌దిత‌రులు భాగ‌మ‌య్యారు. 23 విభాగాల్లో ఆస్కార్ అవార్డులను అందించారు. అందులో నాటు నాటు పాటకు ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో అవార్డు వచ్చింది.

Video Advertisement

ప్రపంచ ప్రసిద్ధ నటీనటులందరూ తమ జీవితంలో ఒక్కసారైనా సాధించాలనుకుని కలలు కనే పురస్కారం… అదే అద్వితీయ ఆస్కార్‌. 95వ వసంతంలోకి అడుగుపెడుతున్న ఈ వేడుకలకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రముఖులు హాజరయ్యారు. అయితే ఈ ఏడాది ఆస్కార్ అవార్డులను గెలుచుకున్న ఉత్తమ చిత్రాలు ఇప్పుడు ఏ ఓటీటీల్లో స్ట్రీమ్ అవుతున్నాయో ఇప్పుడు చూద్దాం..

#1 ఎవ్రీ థింగ్ ఎవ్రీ వేర్ ఆల్ ఎట్ వన్స్

ఈ మూవీ బెస్ట్ పిక్చర్, బెస్ట్ డైరెక్షన్, బెస్ట్ ఎడిటింగ్ విభాగాల్లో ఆస్కార్ అవార్డ్స్ గెలుచుకుంది. ఈ చిత్రం సోనీ లివ్ లో స్ట్రీమ్ అవుతోంది.

Streaming ott list of oscar winning movies..

#2 ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్

ఈ చిత్రం బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్, బెస్ట్ ఇంటర్నేషన్ ఫిల్మ్, బెస్ట్ సినిమాటోగ్రఫీ, బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగాల్లో ఆస్కార్ అవార్డు గెలుచుకుంది. ఈ చిత్రం ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతోంది.

Streaming ott list of oscar winning movies..

#3 బ్లాక్‌ పాంథర్‌ – వకాండా ఫరెవర్‌

బ్లాక్‌ పాంథర్‌ – వకాండా ఫరెవర్‌ చిత్రానికి బెస్ట్ కాస్ట్యూమ్స్ విభాగం లో అవార్డు వచ్చింది. ఈ చిత్రం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతోంది.

Streaming ott list of oscar winning movies..

#4 టాప్ గన్

టామ్ క్రూజ్ నటించిన ఈ చిత్రానికి బెస్ట్ సౌండ్ డిజైన్ లో అవార్డు గెలుచుకుంది. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతోంది.
Streaming ott list of oscar winning movies..

#5 ఆర్ఆర్ఆర్

రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం లో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటించారు. ఈ చిత్రం లోని ‘నాటు నాటు’ పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగం లో ఆస్కార్ అవార్డు గెలుచుకుంది. ఈ చిత్రం జి 5 , డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతోంది.

Streaming ott list of oscar winning movies..

#6 ది ఎలిఫెంట్ విస్పరర్స్

ఈ ఇండియన్ షార్ట్ ఫిలిం బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగం లో అవార్డు గెలుచుకుంది. ఈ చిత్రం ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతోంది.

Streaming ott list of oscar winning movies..

#7 పినాకియో

పినాకియో చిత్రం బెస్ట్ యానిమేటెడ్ ఫీచ‌ర్ ఫిల్మ్ విభాగం లో ఆస్కార్ అవార్డు గెలుచుకుంది. ఈ చిత్రం ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతోంది.

Streaming ott list of oscar winning movies..

#8 అవతార్ 2 (అవతార్ ది వే ఆఫ్ వాటర్)

జేమ్స్ కెమరూన్ తెరకెక్కించిన అవతార్ 2 చిత్రం బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ విభాగం లో ఆస్కార్ అవార్డు గెలుచుకుంది. ఈ చిత్రం ఇంకా ఓటీటీల్లోకి రాలేదు.

Streaming ott list of oscar winning movies..

#9 ది వేల్

ది వేల్ చిత్రం లో నటనకు గాను బ్రెండన్ ఫాస్టర్ ఉత్తమ నటుడిగా ఆస్కార్ పురస్కారం పొందారు. అలాగే బెస్ట్ మేకప్ కి గాను ఈ చిత్రం ఆస్కార్ అవార్డు గెలుచుకుంది. ఈ చిత్రం ప్రస్తుతం ఇండియా లో స్ట్రీమ్ అవ్వట్లేదు.

Streaming ott list of oscar winning movies..

#10 న‌వాల్నీ

బెస్ట్ డాక్యుమెంట‌రీ ఫిల్మ్ విభాగం లో న‌వాల్నీ చిత్రం ఆస్కార్ అవార్డు గెలుచుకుంది. ఈ చిత్రం ప్రస్తుతానికి ఇండియా లో స్ట్రీమ్ అవ్వట్లేదు.

Streaming ott list of oscar winning movies..