తెలుగు చిత్ర పరిశ్రమ లో ఇప్పటివరకు ఎందరో హీరోయిన్లు ఉంటారు. కానీ కొందరు హీరోయిన్లు ఎప్పటికి గుర్తుండిపోతారు. ఈకోవలోకే వస్తుంది నటి కనిహా. శ్రీకాంత్ హీరోగా.. డైరెక్టర్ సత్తిబాబు తెరకెక్కించిన ఒట్టేసి చెపుతున్నా సినిమాలో కథానాయికగా నటించింది కనిహా. ఆ తర్వాత మాస్ మాహారాజా రవితేజ.. భూమిక.. కలిసి నటించిన నా ఆటోగ్రాఫ్ సినిమాతో మరోసారి మెప్పించింది.

Video Advertisement

తెలుగులో పలు చిత్రాల్లో నచించిన ఈ బ్యూటీకి ఆ తర్వాత నెమ్మదిగా అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో మలయాళీ ఇండస్ట్రీలోనే స్థిరపడిపోయింది. ప్రస్తుతం మలయాళంలో జోరుగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. కనిహా అసలు పేరు దివ్య సుబ్రహ్మణ్యం. 2001లో మిస్ చెన్నై అందాల పోటీలో కనిహా విజేతగా నిలిచింది . ఆమె హీరోయిన్ గానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా.. ప్లేబ్యాక్ సింగర్ గా.. టీవీ హోస్ట్ గా కూడా చేసింది.

did you remember this heroine..

ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన కనిహా.. ఇటీవల తీవ్రంగా గాయపడినట్లుగా తెలుస్తోంది. ఆమె మోకాలికి ఎక్కువగానే గాయపడినట్లుగా తెలుస్తోంది. కొద్ది రోజులుగా ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్న ఆమె.. ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తుంది. తాజాగా దానికి సంబంధించిన ఫోటోని సోషల్ మీడియా లో షేర్ చేసింది. వాకర్ పట్టుకుని నడుస్తోన్న ఫోటోను తన ఇన్ స్టా వేదికగా షేర్ చేస్తూ.. బ్యాలెన్స్ గా అడుగులు వేయడం నేర్చుకుంటున్నాను అంటూ రాసుకొచ్చింది. దీంతో ఆమె త్వరగా కోలుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.

did you remember this heroine..

తమిళనాడుకు చెందిన ఆమె 1999లో చదువులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు తమిళనాడు ప్రభుత్వ రాష్ట్ర అవార్డును అందుకున్నారు. రాజస్థాన్‌లోని బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్‌లో మెరిట్ కోటా ద్వారా మెకానికల్ ఇంజినీరింగ్‌ పూర్తిచేసిన కనిహా.. నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అప్పుడే తన పేరును కనిహాగా మార్చుకుంది. 2002లో విడుదైన ఫైవ్ స్టార్ సినిమా ద్వారా సినీరంగ ప్రవేశం చేసింది. కెరీర్ మంచి పిక్స్ లో ఉన్న సమయంలోనే నటుడు జై శ్రీ చంద్రశేఖర్ సోదరుడు శ్యామ్ రాధాకృష్ణన్ ను 2008 జూన్ 15న వివాహం చేసుకున్నారు. వీరికి సాయి రిషి అనే కుమారుడు ఉన్నారు.