Ads
కొన్ని పనులు చిన్నవైనా కూడా ఎక్కువ టైం కేటాయించాల్సి వస్తుంది. అందులో ఒకటి టికెట్ బుకింగ్. ఇప్పుడు అంటే ఆన్లైన్ లో బుక్ చేసే సౌకర్యం వచ్చింది కాబట్టి చాలా వరకు సమయం ఆదా అవుతుంది. కానీ కొన్ని సంవత్సరాల క్రితం టికెట్ బుక్ చేసుకోవాలి అంటే ఒక మనిషి కచ్చితంగా ఆ ప్రదేశానికి వెళ్లి బుక్ చేసుకోవాల్సిందే. అది టికెట్ బుకింగ్ అయినా కావచ్చు లేదా ఇంకేదైనా కావచ్చు.
Video Advertisement
అంతకుముందు కూడా ఆన్లైన్ బుకింగ్ సౌకర్యం ఉండేది. కానీ ఇప్పుడు ఉపయోగించిన అంత బాగా అప్పుడు ఉపయోగించేవారు కాదు. ఇలా ఆన్లైన్ బుకింగ్ ఎక్కువగా ఉపయోగించే వాటిలో హోటల్ రూమ్స్ ఒకటి. ఈ ఆన్ లైన్ హోటల్ రూమ్ బుకింగ్ సౌకర్యాన్ని మరింత సులభం చేసింది ఓయో.
ఓయో వచ్చిన తర్వాత హోటల్ బుకింగ్ చాలా ఈజీ అయ్యింది. అందుకే ఓయో అప్లికేషన్ చాలా ఎక్కువ మంది వాడుతారు. ఓయో సంస్థ కూడా ప్రజలను ఆకర్షించడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారు. అందులో చాలా వరకు సక్సెస్ కూడా అవుతున్నారు. అలా ఓయో సంస్థ ఉపయోగించే స్ట్రాటజీలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
# ఓయో ని రితేష్ అగర్వాల్ స్థాపించారు. ఓయో దాదాపు 300 సిటీలలో అందుబాటులో ఉంది.
# ఓయో స్ట్రాటజీ లో ఆన్లైన్ మార్కెటింగ్ మాత్రమే కాకుండా, ఎక్స్టర్నల్ మార్కెటింగ్ మీద కూడా బాగా దృష్టి పెట్టారు.
# హోటల్ బేస్ ప్రైస్ కంటే తక్కువ ధరకి రూమ్ లని అందిస్తూ ప్రజలని ఎట్రాక్ట్ చేసుకోవడం ఓయో స్ట్రాటజీ లలో ఒకటి.
# హోటల్ ని బట్టి, అందులో ఉండే సౌకర్యాలను బట్టి, ప్రదేశాన్ని బట్టి రూమ్ ధర 999 నుంచి 4 వేల రూపాయల వరకు ఉంటుంది.
# ఓయో సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ప్రచారం చేస్తూ, ఎన్నో క్యాంపెయిన్ లను నిర్వహిస్తోంది.
# తమ కస్టమర్లకు సేవలను అందించడానికి ఓయో సంస్థ యో హెల్ప్ ని రూపొందించింది.
# ఓయో ఎయిర్టెల్ తో సహా జో రూమ్స్, థామస్ కుక్ లాంటి వివిధ సంస్థలతో టై అప్ అయ్యింది.
# ఓయో సంస్థ ఒక్క భారతదేశంలో మాత్రమే కాకుండా నేపాల్, యూఏఈ, మలేషియా లాంటి వివిధ దేశాలలో తమ సేవలను అందిస్తున్నారు.
End of Article