రైలు ఇంజిన్ అంత వేగంగా వెళుతూ విద్యుత్ తీగలను తాకుతూ ఉన్నా…అవి ఎందుకు తెగిపోవో తెలుసా.?

రైలు ఇంజిన్ అంత వేగంగా వెళుతూ విద్యుత్ తీగలను తాకుతూ ఉన్నా…అవి ఎందుకు తెగిపోవో తెలుసా.?

by Mohana Priya

Ads

మీరు ఎప్పుడైనా ట్రైన్ ని చూసినప్పుడు ఒక విషయం గమనించారా? అది ఏంటంటే. ట్రైన్ పట్టాల మీద వెళ్తున్నప్పుడు పైన ఉన్న ఓహెచ్ఈ వైర్లు, అంటే ఓవర్ హెడ్ ఎక్విప్మెంట్ వైర్లు ట్రైన్ కి తగులుతాయి. అలా తగలడం వల్ల వైర్లు ఏమైనా తెగిపోతాయా? లేదా విరుగుతాయా? మనలో చాలా మందికి ఈ ప్రశ్న వచ్చే ఉంటుంది. దీని జవాబు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Video Advertisement

మనం ఏదైనా కట్ చేయాలి అనుకుంటే, ఒకే సారి కి అయితే కట్ అవ్వవు. కొంచెం సేపు అలాగే కట్ చేసిన తర్వాత వస్తువు కట్ అవుతుంది. అంటే,  ఫిజిక్స్ ప్రకారం ఏదైనా ఒక వస్తువు ని కట్ చేయాలి అంటే దానిపై కాన్స్టాంట్ గా ఫోర్స్ అప్లై చేయాలి. కానీ ఇక్కడ ట్రైన్ కి వైర్లు తగిలినప్పుడు ట్రైన్ ఎటువంటి ఫోర్స్ అప్లై చెయ్యదు.

లోకోమోటివ్ ఎంత ఫాస్ట్ గా వెళ్తున్నా కూడా ఫోర్స్ అనేది అప్లై అవ్వదు.  ట్రైన్ పైన వైర్ కి తగిలే భాగాన్ని పాంటోగ్రాఫ్ అంటారు. పాంటోగ్రాఫ్ ద్వారా ఎలక్ట్రిసిటీ ఓఎచ్ఈ నుండి లోకోమోటివ్ ట్రాన్స్ఫార్మర్ కి వెళ్తుంది. పాంటోగ్రాఫ్ లో ఓ ఎచ్ ఈ కి తగిలే భాగాన్ని షూ లేదా ప్యాన్ అని అంటారు.

ప్రతి షూ కి ఒక పల్చటి లేయర్ లో గ్రాఫైట్ ఫిక్స్ చేస్తారు. గ్రాఫైట్ చాలా మంచి సాలిడ్ లూబ్రికెంట్. గ్రాఫైట్ కి మెల్టింగ్ పాయింట్ హై లో ఉంటుంది కాబట్టి, ఎక్కువగా వేడి అయ్యే సర్ఫేస్ మీద గ్రాఫైట్ ని వాడతారు. అలాగే గ్రాఫైట్ ఎలక్ట్రిసిటీ కి గుడ్ కండక్టర్. పాంటోగ్రాఫ్ షూ మీద ఉన్న గ్రాఫైట్ పల్చగా అయిపోయిన ప్రతిసారి గ్రాఫైట్ లేయర్ ని మారుస్తారు.

పాంటోగ్రాఫ్, ఓహెచ్ఈ కి తగిలినప్పుడు ఫ్రిక్షన్ ఇంకా హీట్ తగ్గించే లూబ్రికెంట్ గా గ్రాఫైట్ పనిచేస్తుంది. పాంటోగ్రాఫ్, వైర్ కి ఒకే చోట తగలకుండా ఉండడానికి ఓహెచ్ఈ వైర్లను ఎప్పుడూ ఒకటే డైరెక్షన్ లో కాకుండా డైరెక్షన్స్ మార్చి ఏర్పాటు చేస్తారు.కానీ ఒక సమయంలో కాకపోయినా కొంతకాలానికి అయినా సరే ఓహెచ్ఈ వైర్లు కొంచెం గీసుకుపోవడం లాంటివి అవుతాయి. ఒకవేళ వైర్ 4 ఎం.ఎం వరకు డామేజ్ అయితే అప్పుడు వైర్లని మారుస్తారు.

 


End of Article

You may also like