పేరడీ సాంగ్స్ అంటే ఇలా ఉండాలి.. అప్పట్లో ఈ 10 పాటలను మనం ఇలా కూడా పాడుకునేవాళ్ళం.. గుర్తుందా..?

పేరడీ సాంగ్స్ అంటే ఇలా ఉండాలి.. అప్పట్లో ఈ 10 పాటలను మనం ఇలా కూడా పాడుకునేవాళ్ళం.. గుర్తుందా..?

by Anudeep

Ads

మన తెలుగువాళ్ళకు ఎవరికీ లేనంత క్రియేటివిటీ ఉంది. అందుకే.. మనం ప్రతిదాన్ని మన స్టయిల్ లోకి మార్చేసుకుని ఎంజాయ్ చేస్తాం. వేపకాయంత వెర్రి ఉన్నా అది కూడా కళాపోషణ కిందే లేక్కేట్టేసే కళా పోషకులం మనం. అందుకే.. మన కవులు, సాహితి ప్రియుల రచనలలోనూ అక్కడక్కడా వెటకారం కనబడుతూ ఉంటుంది. ఇక..మనలాంటి సామాన్యుల్లో.. సినిమా పాటలకి పేరడీ లిరిక్స్ ని కనిపెట్టే రచయితలూ భేషుగ్గా ఉంటారు. అలా.. మన చిన్నతనం లో మనం పాడుకునే పేరడీ సాంగ్స్ లిస్ట్ పై మీరు కూడా ఓ లుక్ వేయండి.

Video Advertisement

#1 దిల్ దివానా:
దిల్ దీవానా.. ప్యార్ హసీనా అంటూ పాడుకునే ఈ బాలీవుడ్ సాంగ్ ని మనం తెలుగులో ఎలా పాడుకునే వాళ్ళమో చూడండి..

“దిల్ దీవానా..దిక్కులేని దానా.. నీకు దిక్కెవరే..
చిచ్చుబుడ్డి పేలి బొచ్చు అంతా రాలి బోడిగుండాయనే..”

#2 నమ్మవేమో గాని:

పరుగు సినిమా లో హీరోయిన్ గురించి హీరో పాడే పాట “నమ్మవేమో గాని.. అందాల యువరాణి.. నేలపై వాలింది.. నా ముందే నిలిచింది..”

 

ఈ పాటకి మనం పాడుకునే పేరడీ సాంగ్ ఎలా ఉండేదంటే..
“నమ్మవేమో గాని.. పక్కింట్లో బిర్యానీ..
నేలపై వాలింది… కుక్కొచ్చి నాకింది..”

#3 హృదయం ఎక్కడున్నది..

గజినీ సినిమాలో వచ్చే..” హృదయం ఎక్కడున్నది.. హృదయం ఎక్కడున్నది.. నీ చుట్టూనే తిరుగుతున్నది..” అంటూ వచ్చే పాటని మనం ఎలా మార్చేసి పాడేవాళ్ళం అంటే..

“పందిపిల్ల ఎక్కడున్నది.. పందిపిల్ల ఎక్కడున్నది..
నా చుట్టూనే తిరుగుతున్నది..”

#4 చిన్ని చిన్ని ఆశ..
రోజా లోని చిన్ని చిన్ని ఆశ పాటని మనం ఎలా పాడుకునే వాళ్ళం అంటే..

“ప్లేట్ లోన దోశ..
కారం ఎక్కువ వేసా..
ఉప్పు తక్కువ వేసా..
తినలేక చచ్చా..”

#5 వాలు కనుల దానా :
ప్రేమికుల రోజు సినిమాలో వచ్చే ఈ వాలు కనుల దానా పాట ఎంత హిట్ అయిందో మనందరికీ తెలుసు.. మనం ఈ పాటని కూడా వదల్లేదు అన్నమాట. దీనిని ఎలా పాడేవాళ్ళం అంటే..

“కొండముచ్చు దానా నీ మూతి ఉండే జానా..
నీకు కొవ్వు ఉంది చానా..
మంచి మాట రాక కొవ్వు వచ్చెనే..”

#6 అమ్మాయే సన్నగా:
ఖుషి సినిమా లో వచ్చే అమ్మాయే సన్నగా… అరనవ్వే నవ్వగా.. సాంగ్ కి అప్పట్లో సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉండేది. కానీ, కాదేది పేరడీ వెర్షన్ కి అనర్హం అన్నట్లు.. ఈ పాటని కూడా మనం ఇలా పేరడీ చేసేశాం..

“అమ్మాయే సన్నగా..
అబ్బాయే లడ్డుగా..
బస్సెక్కి కూర్చుంటే..
బస్సులు బోర్లా పడ్డాయే..”

#7 అనగనగా ఆకాశం ఉంది..

“నువ్వేకావాలి సినిమా వచ్చి ఇన్నేళ్లు అయినా.. “అనగనగా ఆకాశం ఉంది ” పాటని మాత్రం మరచిపోలేము.. అలాగే..ఈ పాట పేరడీ వెర్షన్ ను కూడా మర్చిపోలేం..

“అనగనగా హోటల్ ఉంది..
హోటల్ లోన టేబుల్ ఉంది..
టేబుల్ పైనా ప్లేట్ ఉంది..
ప్లేట్ లోనా ఇడ్లీ ఉంది..
ఆ ఇడ్లీ నాకే కావాలి..
నా బిల్లు నువ్వే కట్టాలి..”

#8 వాన వాన వెల్లువాయే..

ఇది ఎవర్ గ్రీన్ సాంగ్. రామ్ చరణ్ రీమేక్ చేసినా కూడా ఈ పాట కి ఫాలోయింగ్ ఏ మాత్రం తగ్గలేదు. దీనిని మనం పేరడీ వెర్షన్ లో ఎలా మార్చేసాం అంటే..

” వానా వానా వెల్లువాయే..
పక్కింటోడి పెళ్ళాం పోయే..” అంటూ పాడేవాళ్ళం.

#9 పంచదారా బొమ్మా బొమ్మా..
మగధీర సినిమా లో వచ్చే పంచదారా బొమ్మా బొమ్మా అంటూ వచ్చే ఈ పాటకి ఎంత మంది ఫాన్స్ ఉన్నారు..? పేరడీ వెర్షన్ ను కూడా చూసి.. దీనికి ఎంత మంది ఫాన్స్ ఉన్నారో కామెంట్స్ లో చెప్పేయండి.

“పంచదారా ఇడ్లీ.. ఇడ్లీ..
నంచుకో కొబ్బరి చట్నీ..
మంచి నూనెలో వేసా బజ్జి..
ఫాస్ట్ గా తినరా బుజ్జి..”

#10 బొమ్మను గీస్తే నీలా ఉంది..

బొమ్మరిల్లు సినిమాని మరచిపోలేము.. హాసిని ని మరచిపోలేము. ఆ సినిమా లో ఈ పాటని.. ఈ పాటకి రాసిన పేరడీ వెర్షన్ ని కూడా అంత ఈజీ గా మరచిపోలేము.

“బొమ్మను గీస్తే.. కుక్కలా ఉంది..
దగ్గరకెళితే.. బౌ బౌ అంది..”

అదండీ మన పేరడీ సాంగ్ ల కథ. అప్పట్లో క్రియేటివిటీ లెవెల్ ఆ రేంజ్ లో ఉండేది మరి. మేమేమైనా మిస్ చేసినా.. లేదంటే.. మీరేదయినా పేరడీ సాంగ్ లు పాడుకున్నా.. అవి కూడా కింద కామెంట్స్ లో అందరితో పంచుకోండి.


End of Article

You may also like