ఏమైనా అంటే ట్రెండ్ అంటున్నారు.? కొంతమంది అమ్మాయిలు ఇలా అవ్వడానికి తల్లితండ్రులే కారణమా..?

ఏమైనా అంటే ట్రెండ్ అంటున్నారు.? కొంతమంది అమ్మాయిలు ఇలా అవ్వడానికి తల్లితండ్రులే కారణమా..?

by kavitha

Ads

ఇటీవల కాలంలో సినిమాల ప్రభావం సమాజం పైన ఉంటుందనే విషయం తెలిసిందే. అందులోనూ సినిమా ప్రభావం ముఖ్యంగా యువత పైన అయితే ఇంకా ఎక్కువగా ఉంటుంది. మరీ ముఖ్యంగా ఆడపిల్లల మీద అయితే సినిమాల ప్రభావం మరీ ఎక్కువగా ఉంటుంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

Video Advertisement

సినిమా ప్రభావం అనేది అందరి మీద ఉంటుంది, మొత్తం ప్రపంచం మీద కూడా సినిమాల ప్రభావం ఉంటుంది. ఇక సినిమాల ప్రభావం అమ్మయిల పైన కూడా ఉంటుది. ముఖ్యంగా ఆడపిల్లలంటే హెయిర్ స్టైల్స్, బొట్లు, లిప్ స్టిక్స్, బట్టలు, వేషధారణ ఇలా అన్నింటి పైన సినిమాల ప్రభావం ఉంటుంది.
మరి ముఖ్యంగా అమ్మాయిల ఈమధ్యకాలంలో సినిమాలలో చూపించినట్టుగా ఇంట్లో టి షర్ట్, షార్ట్స్ ఎక్కువగా ధరిస్తున్నారు. చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవారి వరకు కూడా టి షర్ట్, షార్ట్స్ వేసుకుని తిరుగుతున్నారు. ఒకప్పుడు హిందీ సినిమాలలో హీరోయిన్లు చిన్న చిన్న టి షర్ట్, షార్ట్స్ వేసుకునేవారు.
ఆ తరువాత కాలంలో తెలుగు సినిమాలలో కూడా ఈ ఫ్యాషన్ వచ్చింది. వాటిని చూసిన అమ్మాయిలు అలానే పడుకునే సమయంలో లేదా ఇంట్లో ఉన్నప్పుడు టి షర్ట్, షార్ట్స్ వేసుకుంటున్నారు. అడిగితే ట్రెండ్ కు తగ్గట్టుగా నడుస్తున్నామని అంటున్నారు. కానీ వారు వేసుకునే బట్టలు ఖచ్చితంగా సినిమా ప్రభావమే అని అన్నారు. అమ్మాయిలు ఫ్యాషన్ లో మార్పు వచ్చినపుడు, వారు యాక్సెసరిస్ ఎక్కువగా కోరుకుంటారు. వాటికోసం ఎక్కువగా ఖర్చుపెడుతూ ఉంటారు.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల వల్ల ప్రతి సినిమాని నియమ నిబంధనలు ఫాలో అవ్వకుండా చూస్తున్నారు. దాంతో యువత కూడా తమ వయసుకి మించిన సినిమాలు చూస్తున్నారు. తెలిసి తెలియని వయసులో వారు ఉంటారు కాబట్టి అందులో హీరో హీరోయిన్లు చేసే విషయాలని వారు ఫాలో అయ్యే అవకాశాలు ఉన్నాయి. అమ్మాయిలు అబ్బాయిలు అనే తేడా లేకుండా సినిమాలు చూసే ప్రతి ఒక్కరు కూడా అందులో ఉన్న లీడ్ రోల్ ఎలాంటి పనులు అయితే చేశారో అలాంటివే చేయాలి అనుకుంటారు.

parents are responsible for daughters behavior

ఈ మధ్యకాలంలో వచ్చే చాలా సినిమాల్లో హీరో హీరోయిన్స్ కూడా కరెక్ట్ గా ఉండరు అని చూపిస్తున్నారు. కాబట్టి ఈ ప్రభావం యువతపై పడుతుంది. వస్త్రధారణ విషయంలో కూడా కొన్ని సినిమాల్లో ఇలా చూపిస్తున్నారు. వారు ఎలాంటి ఉద్దేశంతో చూపించినా కూడా వయసు అలాంటిది కాబట్టి వీరికి తప్పుగా అర్థం అయ్యి అవి ఫాలో అవుతారు.

అందుకే అమ్మాయిలు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.ఇలాంటి సమయంలో టీనేజి అమ్మాయిల ప్రవర్తనను తల్లిదండ్రులు అమ్మాయిలను గమనిస్తూ ఉండాలి. వారు ఎలాంటి సినిమాలను చూస్తున్నారు అనే విషయం పైన అవగాహన కలిగి ఉండాలి. ప్రస్తుత కాలంలో అమ్మాయిల విషయంలో జాగ్రత్తగా ఉండడం తల్లులకు అవసరం. సినిమాలు చూసి అమ్మాయిలు అలాంటి డ్రెస్ లను వేసుకుంటున్నారు, కాబట్టి అవి అమ్మాయి తల్లిదండ్రులే దానిని మాన్పించాలి.

Also Read:  పెళ్లి అయిన తరువాత లెగ్గింగ్స్, జీన్స్ వేసుకోవడం వల్ల కలిగే ఈ నష్టాల గురించి తెలిస్తే… ఆడవారు ఇంకోసారి ఈ తప్పు చేయరు..!


End of Article

You may also like