కన్నడ నటుడు, డైరెక్టర్ రిషబ్ శెట్టి తెరకెక్కించిన కాంతార చిత్రం ఎంత సెన్సేషన్ సృష్టించిందో తెలిసిందే. ఆ తర్వాత తెలుగుతో పాటు ఇతర భాషల్లోకి విడుదల అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. కర్ణాటక ఆదివాసీ ప్రజల సంస్కృతి, సంప్రదాయాల ఆధారంగా రూపొందించిన ఈ చిత్రం అందర్నీ ఆకట్టుకుంది. క్లైమాక్స్ లో రిషబ్ నటన సినిమాకే హైలైట్.

Video Advertisement

 

అయితే ‘పరుచూరి పాఠాలు’ పేరుతో పరుచూరి గోపాలకృష్ణ యూట్యూబ్ వీడియోల ద్వారా కొత్తగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సినిమాలపై తన అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యం లో ఆయన తాజాగా ‘కాంతార’ సినిమా రివ్యూ ఇచ్చారు.

paruchuri comments on kanthaara movie..!!

ఈ సినిమా గురించి పరుచూరి గోపాల కృష్ణ మాట్లాడుతూ..” ఈ సినిమా గురించి విన్నప్పుడు ముందు ఆత్మలకు సంబంధించినది అనుకున్నా.. కానీ ఇంత స్పందన వచ్చేసరికి నేను చూసాను. సినిమా నాకు చాలా నచ్చింది. కర్ణాటక లోని ఒక ప్రాంతం లో గతం లో జరిగిన ఒక సంఘటన ఆధారంగా ఈ చిత్రం తీశారు. మన తెలుగులో వచ్చిన మా భూమి లాంటిది ఈ చిత్రం. ఆ సినిమాలో ప్రజలు పోరాడారు. ఇందులో ఒక భూత్ కోలా నృత్యకారుడు పోరాడాడు. ఇందులో ఎన్నో గొప్ప విషయాలు ఉన్నాయి. ముఖ్యం గా స్క్రీన్ ప్లే. రిషబ్ శెట్టి ఈ సినిమా కథ, కథనం అద్భుతం గా తీర్చిదిద్దారు.” అని పరుచూరి గోపాల కృష్ణ అన్నారు.

paruchuri comments on kanthaara movie..!!

ఈ సినిమాలో నటీనటుకు అందరూ కూడా ఎంతో బాగా చేసారు అని ఆయన పేర్కొన్నారు. ఈ సినిమాలో నటన, కథ, స్క్రీన్ ప్లే ఇలా ఏ విషయం లోనూ లోపాలు లేవు అందుకే ఈ చిత్రం ఇంత ఘన విజయం సాధించింది అని పరుచూరి పేర్కొన్నారు. హోంబలే సంస్థ నిర్మించిన ఈ చిత్రం లో రిషబ్ కి జోడీగా సప్తమి గౌడ నటించింది. ఏ అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం జాతీయ స్థాయి లో గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతోంది.