Ads
స్టార్ హీరోయిన్ సమంత నటించిన పీరియాడికల్ మూవీ శాకుంతలం. భారీ అంచనాల మధ్య ఏప్రిల్14న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్యూర్‌గా నిలిచింది. గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ పాన్ ఇండియా సినిమా ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది.
Video Advertisement
‘గుణ టీం వర్క్స్’ ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ బ్యానర్ పై నీలిమ గుణ, దిల్ రాజు కలిసి ఈ సినిమాలో మలయాళ నటుడు దేవ్ మోహన్ ప్రధాన పాత్రలో నటించారు. అలాగే అల్లు అర్జున్ గారాల పట్టి అల్లు అర్హ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటించింది. అయితే తాజాగా ఆ మూవీ గురించి తన యూట్యూబ్ ఛానల్‌లో పరుచూరి గోపాలకృష్ణ రివ్యూ ఇచ్చారు.
శకుంతల పాత్రలో సమంత అద్భుతంగా నటించారని విశ్లేషించిన పరుచూరి గోపాలకృష్ణ… గుణశేఖర్ కథను రాసిన విధానం, సినిమాను తెరకెక్కించిన విధానం బాగున్నాయన్నారు. అయితే సెకండ్ హాఫ్ వల్లే సినిమా క్లిక్ కాలేకపోయి ఉండొచ్చని అన్నారు. శకుంతల గర్భం దాల్చిన తర్వాత భర్త దుష్యంతుడిని కలవడం కోసం రాజ్యానికి వెళ్లడం.. అక్కడ ఆమెను అవమానించడం రాళ్లతో కొట్టడం వంటి సన్నివేశాలు సినిమాలో బాగా చూపించారు అని ఆయన అన్నారు.
శకుంతల, దుష్యంతులు కలుస్తారా? లేదా? అనే ఆసక్తి ఫస్టాఫ్‌లో ప్రేక్షకుల్లో క్రియేట్ చేశారు. కానీ సెకండాఫ్‌లో ఉంగరాన్ని చూసిన వెంటనే రాజుకు గతం గుర్తుకురావడం.. వంటి సీన్లు అంత ప్రభావంతం గా లేవని అన్నారు పరుచూరి. ఇదే సినిమాకు పెద్ద మైనస్ అయ్యిందని ఆయన అభిప్రాయ పడ్డారు. దుర్వాసుడిగా మోహన్ బాబు, సమంత, దేవ్ మోహన్ అద్భుతంగా నటించారు అని ఆయన అన్నారు.
మహాభారతం నేపథ్యం లో వచ్చిన అనేక కథలు సూపర్ హిట్స్ అందుకున్నాయని అన్నాడు. కానీ కొన్ని పొరపాట్ల కారణం గా శాకుంతలం మూవీ ప్లాప్ అయ్యిందని ఆయన అన్నారు. ఇక మంచి కథలను మర్చి పోతున్న రోజుల్లో సొంత డబ్బును రిస్క్ చేసి ఈ సినిమాను చేసినందుకు గుణశేఖర్ గట్స్ కు హ్యాట్సాఫ్ అంటూ పొగిడారు పరుచూరి గోపాల కృష్ణ.
End of Article