మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘గాడ్‌ఫాదర్’ మూవీ ఇటీవల అభిమానుల్ని మెప్పించినా.. బాక్సాఫీస్ వద్ద అంచనాల్ని అందుకోలేకపోయింది. అక్టోబరు 5న రిలీజైన ఈ మూవీ తొలి రోజు నుంచే హిట్ టాక్‌ని సొంతం చేసుకుంది. కానీ కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. ఓవరాల్‌గా ‘ఆచార్య’ లాంటి డిజాస్టర్ తర్వాత ‘గాడ్‌ఫాదర్’ మూవీ చిరంజీవికి టాక్‌ పరంగా ఊరటనిచ్చింది.

Video Advertisement

 

వాస్తవానికి గాడ్‌ఫాదర్ సినిమా.. మలయాళం మూవీ ‘లూసిఫర్‌’కి రీమేక్. దాంతో గాడ్‌ఫాదర్ రిలీజ్‌కి ముందే లూసిఫర్‌ని చూసిన ప్రేక్షకులకి ఈ కథ ఏంటో తెలిసిపోయింది. దీంతో చిరు ఇమేజ్ తగ్గట్టు కొన్ని మార్పులు చేసి ప్రేక్షకుల ముందుకి తెచ్చారు దర్శకుడు మోహన్ రాజా. అయితే తాజాగా ఆ మూవీ గురించి తన యూట్యూబ్ ఛానల్‌లో పరుచూరి గోపాలకృష్ణ రివ్యూ ఇచ్చారు.

paruchuri gopalakrishna comments on 'god father' movie..

ఈ క్రమంలో సినిమాలో చిన్న చిన్న తప్పిదాల్ని గుర్తు చేసిన ఆయన.. డ్యాన్స్‌లు లేని చిరంజీవి పాత్రని చూడటం కాస్త ఇబ్బందిగా అనిపించిందని అభిప్రాయపడ్డారు. అయితే చిరు బాడీ లాంగ్వేజ్ కి ఇలాంటి స్లో పేస్ కథలు సెట్ కావని ఆయన అన్నారు. ” తన చెల్లెళ్లకు దూరం గా ఉంటూ వారిని ఎలా రక్షించాడు అనే ఒక కర్ణుడి కథ ఇది. సమయానుగుణం గా ట్విస్ట్ లు రివీల్ చేసారు. మాతృకతో పోలిస్తే స్క్రీన్ ప్లే బావుంది. అలాగే డైలాగ్స్ బావున్నాయి కానీ.. చిరంజీవి కి తగ్గట్టు లేవు” అని పరుచూరి తెలిపారు.

paruchuri gopalakrishna comments on 'god father' movie..

” అలాగే సల్మాన్ ఖాన్ ఈ సినిమాకి ఒకరకంగా ప్లస్. మరో రకంగా దెబ్బతీశాడు. ఎలా అంటే? చిరంజీవి నడుస్తుంటే సల్మాన్ ఖాన్ ఫైట్ చేయడం అభిమానులకి బాధ కలిగించింది. ఆఖరికి క్లైమాక్స్‌లోనూ అదే పంథాని కొనసాగించారు. అదే సల్మాన్ క్యారెక్టర్‌ని పవన్ కళ్యాణ్ లేదా రామ్ చరణ్‌ చేసుంటే ఆ ఫీలింగ్ అభిమానులకి వచ్చేది కాదు.” అని పరుచూరి వెల్లడించారు.