నట సార్వభౌమ నందమూరి తారక రామారావు శతజయంతి సందర్భంగా రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఎన్టీఆర్ నటించిన ‘పాతాళ భైరవి’ చిత్రాన్ని గుర్తుచేసుకున్నారు.

Video Advertisement

ఎన్టీఆర్‌ శతజయంతి సందర్భంగా పరుచూరి పాతాళ భైరవి సినిమా గురించి మాట్లాడుతూ ఈ సినిమా విడుదల అయ్యి  72 సంవత్సరాలు పూర్తయిందని అన్నారు. ఈ చిత్ర విశేషాలను కూడా వెల్లడించారు.నట సార్వభౌమ నందమూరి తారక రామారావు తెలుగు, హిందీ, తమిళం భాషలలో కలిపి సుమారు 400 చిత్రాలలో నటించి గొప్పనటుడుగా గుర్తింపును సొంతం చేసుకున్నారు. ఆయన తన కెరిర్ లో నటించిన చాలా చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి, బాక్సాఫీస్ దగ్గర రికార్డులను సృష్టించాయి. ఎన్టీఆర్ నటించిన చిత్రాలలో ‘పాతాళభైరవి’ మూవీ  ఒకటి. ఇప్పటికీ ఈ చిత్రం టీవీలో ప్రసారమైతే చూసేవారు చాలామంది ఉన్నారు. తాజాగా ఈ చిత్రం గురించి టాలీవుడ్ రైటర్ పరుచూరి గోపాలకృష్ణ ఎన్టీఆర్‌ శతజయంతి సందర్భంగా జ్ఞాపకం చేసుకున్నారు. ఆయన తన ఛానెల్ పరుచూరి పలుకుల్లో ఈ సినిమా గురించి మాట్లాడుతూ, ఈ మూవీ తరువాత ఎన్టీఆర్ కు ఎంతో మంది ఫ్యాన్స్ గా మారారని చెప్పారు. బి.నాగిరెడ్డి, కేవిరెడ్డి, చక్రపాణి వీరంతా చాలా గొప్పవారని అన్నారు. ఈ సినిమా అప్పట్లో అద్భుతమని అన్నారు. ధైర్యే సాహసే లక్ష్మి అనే పాయింట్ తో దర్శకనిర్మాతలు అప్పట్లో సంచలనం సృష్టించారని చెప్పారు. ఈ చిత్రానికి ముందు వరకు జానపద చిత్రాలంటే అక్కినేని నాగేశ్వరరావు గారు గుర్తుకు వచ్చేవారని తెలిపారు. అయితే పాతాళ భైరవి సినిమా విడుదలైన తరువాత జానపదం అంటే ఎన్టీఆర్ అనేంతగా ఆయన ప్రభావం చూపారని వెల్లడించారు. జానపదం, సాంఘికం,చారిత్రకం, పౌరాణికం లాంటి చిత్రాలలో ఎన్టీరామరావుగారు జీవించేవారని చెప్పారు. ఇక పాతాళభైరవి చిత్రాన్ని ఎన్నిసార్లు చూసినప్పటికి, మళ్ళీ చూడాలనిపించేలా ఏదో కొత్తదనం ఈ సినిమాలో కనిపిస్తుందని తెలిపారు.
ఆ మూవీలోని డైలాగ్స్ ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయని, ఆడియెన్స్ ని ఆకట్టుకుంటాయని అన్నారు. యస్.వి. రంగారావుని మాంత్రికుడిగా చూస్తే భయమేసేదని అన్నారు. రీరిలీజ్ చేసినా వంద రోజులు ఆడే చిత్రాల లిస్ట్ లో ఈ చిత్రం ముందు ఉంటుందన్నారు. ఈ చిత్రం ఓటీటీల్లో ఉన్నట్లయితే చూడమని అందరిని పరుచూరి కోరారు.

Also Read: “ఆదిపురుష్” సినిమాలో “ప్రభాస్” కంటే ముందుగా అనుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా?