షారుఖ్ ఖాన్ “పఠాన్” ఫస్ట్ రివ్యూ..! సినిమా ఎలా ఉందంటే..?

షారుఖ్ ఖాన్ “పఠాన్” ఫస్ట్ రివ్యూ..! సినిమా ఎలా ఉందంటే..?

by Anudeep

Ads

గత కొన్నేళ్లుగా షారుఖ్ ఖాన్ ట్రాక్ రికార్డు ఏమంత బాగాలేదు. ఒకపుడు కింగ్‌ ఖాన్‌గా బాలీవుడ్ బాక్సాఫీస్‌ను తన కనుసైగలతో శాసించిన ఈయన ఇపుడు హీరోగా ఉనికి కోసం పోరాడుతున్నాడు. ఈయన సినిమాలు వచ్చనవి వచ్చినట్టే బాక్సాఫీస్ దగ్గర బొక్కాబోర్లాపడుతున్నాయి. ఈయన చివరగా ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన సినిమాలు ప్లాప్ లుగా నిలిచాయి. అయితే మధ్యలో ‘రాకెట్రీ.. ది నంబి ఎఫెక్ట్’, లాల్ సింగ్ చద్దా, బ్రహ్మాస్త్ర’ సినిమాల్లో అతిథి పాత్రల్లో మెరిసారు.

Video Advertisement

అయితే తాజాగా పఠాన్ చిత్రం తో ప్రేక్షకుల ముందుకి రానున్నారు షారుఖ్. ఇందులో దీపికా పదుకొనె కథానాయిక. ఈ సినిమాను యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించింది. ఈ నెల 25న భారత గణతంత్య్ర దినోత్సవ కానుకగా ఈ సినిమా విడుదల కానుంది. ఈ చిత్రానికి సిద్ధార్థ్ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. హిందీతో పాటు తెలుగు, త‌మిళ భాష‌ల్లో సినిమా రిలీజ్ అవుతుంది. ఈసారి షారూఖ్ ఖాన్ స్ట్రాట‌జీని మార్చేశారు. హిందీతో పాటు సౌత్ ఇండ‌స్ట్రీ మార్కెట్‌లో పాగా వేయ‌టానికి రెడీ అయ్యారు. అందులో భాగంగా ‘పఠాన్’ సినిమాను తెలుగు, త‌మిళ భాష‌ల్లో విడుద‌ల చేస్తున్నారు.

umair sandhu review on pathaan movie

పఠాన్ మూవీ రిలీజ్‌కు ముందే రికార్డుల‌ను క్రియేట్ చేస్తుంది. ఇప్ప‌టికే అడ్వాన్స్ బుకింగ్స్‌లో పాన్ ఇండియా రేంజ్‌లో మూడో స్థానంలో నిలిచింది. ఈ చిత్రంలో హీరో జాన్ అబ్రహం కీలక పాత్ర పోషిస్తున్నాడు. అలాగే ఈ మూవీలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కూడా అతిధి పాత్రలో మెరవనున్నలు సమాచారం. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన రివ్యూ ఒకటి ప్రస్తుతం వైరల్ గా మారింది. దుబాయ్ లో ఉంటూ ఇండియన్ సినిమాలకు ఫస్ట్ రివ్యూ ఇచ్చే సినీ క్రిటిక్, ఓవర్సీస్ సెన్సార్ బోర్డు సభ్యుడిగా చెప్పుకునే ఉమైర్ సంధు పఠాన్ మూవీ రివ్యూ చెప్పేసారు.

umair sandhu review on pathaan movie

“పఠాన్ సినిమా పూర్తిగా మాస్ ఎంటర్టైనర్. ఇప్పటివరకు చూసిన బాలీవుడ్ చిత్రాల్లో ఇదే బెస్ట్ యాక్షన్ మూవీ. సినిమా మొత్తంలో షారుక్ ఖాన్, దీపికా పదుకొణె, జాన్ అబ్రహం పర్ఫామెన్స్ అద్భుతంగా ఉంది. పఠాన్ క్లైమాక్స్ మిమ్మల్ని షాక్ కు గురి చేస్తుంది. గూస్బంప్స్ తెప్పిస్తుంది. బాలీవుడ్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా పఠాన్ నిలుస్తుంది. ఈ సినిమాకు నేను 5 స్టార్ రేటింగ్ ఇస్తున్నాను. గతేడాది ఆర్ఆర్ఆర్ చిత్రానికి ఇచ్చాను. ఈ ఏడాది పఠాన్ సినిమాకు 5 స్టార్ రేటింగ్ ఇస్తున్నాను. ఈ సినిమాకు ఆ అర్హత ఉంది” అని రాసుకొచ్చాడు ఉమర్ సంధు.


End of Article

You may also like