పవన్ కల్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈయన సినిమాలు వచ్చాయంటే పండగ చేసుకుంటారు ఫ్యాన్స్. ఒకప్పుడు అయితే పవన్ సినిమా వచ్చిందంటే కుర్రాళ్లకు ఫెస్టివల్. ముఖ్యంగా 20 ఏళ్ల కింద పవన్ క్రేజ్ ఊహకు కూడా అందేది కాదు.
Video Advertisement
అందుకే అప్పట్లో కార్పోరేట్ కంపెనీలు కూడా పవన్‌తో యాడ్స్ కోసం వెంటపడ్డాయి. పవర్ స్టార్ కూడా ఖుషీ టైమ్‌లో పెప్సీ యాడ్ చేసాడు. అప్పట్లో ఆయన చేసిన యాడ్ కూడా బంపర్ హిట్ అయింది. ముఖ్యంగా పవన్ కల్యాణ్ స్టైల్ ట్రెండ్ సెట్టర్ అంతే. ఇక ఈ యాడ్ తర్వాత పవన్ మరో యాడ్ లో నటించలేదు. కూల్ డ్రింక్స్ తాను తాగను కాబట్టే వాటిల్లో నటించట్లేదని పవన్ ఒక సందర్భం లో చెప్పాడు.
2001లో ఈ యాడ్ షూట్ చేసారు. ఖుషీ సినిమాతో అప్పటికే సంచలనాలు సృష్టించాడు పవన్. అయితే ఈ యాడ్ చేసినందుకు అప్పట్లో పవన్ కళ్యాణ్ బాగానే పారితోషికాన్ని అందుకున్నారట. ఈ యాడ్ చేసినందకు అప్పట్లోనే తనకు రూ.100 నుంచి 150 కోట్ల రెమ్యూనరేషన్ ఇచ్చినట్లుగా గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు పవన్.
దాదాపు 20 ఏళ్ల కిందటే 100 కోట్ల పారితోషికాన్ని అందుకున్నారంటే పవన్ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. అప్పట్లో సౌత్ ఇండియాలో ఒక స్టార్ హీరో ప్రొడక్ట్స్ యాడ్ ఇవ్వడం అదే మొదటిసారి. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి థమ్స్ అప్ యాడ్ చేశారు. ఆ ప్రకటనలో నటించినందుకు గానూ.. జాతీయ స్థాయిలో చేస్తున్న హీరోల కంటే తనకు రూ.40 లక్షలు ఎక్కువే ఇచ్చారని తెలిపారు.
అప్పట్లో ఈయన చేసిన పెప్సీ యాడ్ ఫోటోలు కొన్ని ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అందులో గుండుతో పవన్ ఇచ్చిన పోజులు అదిరిపోయాయి. అయితే ఆ తర్వాత అనివార్య కారణాలతో పెప్సీతో కాంట్రాక్ట్‌ను క్యాన్సిల్ చేసుకున్నాడు పవన్. అప్పట్నుంచి ఇప్పటి వరకు మళ్లీ యాడ్స్ జోలికి పోలేదు పవర్ స్టార్.