రాజకీయాల్లో బిజీ అయినా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల కోసం ‘వకీల్ సాబ్’ సినిమాతో కం బ్యాక్ ఇచ్చారు. అప్పటి నుంచి వరుస ప్రాజెక్టులు ఓకే చేస్తూ బిజీ గా ఉంటున్నారు. ఇప్పటికే 3 ప్రాజెక్టులకు ఓకే చెప్పిన పవన్ వాటిని ఎప్పటికి పూర్తి చేస్తారా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు.

Video Advertisement

ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు పవన్ కళ్యాణ్. మరోవైపు సాహో ఫేమ్ సుజీత్ తో పవన్ సినిమా చేయనున్నట్లు డీవీవీ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ర‌న్ రాజా ర‌న్‌, సాహో చిత్రాలతో తన దర్శకత్వ ప్రతిభను బయటపెట్టిన యువ దర్శకుడు సుజీత్.. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తుండటం ఆసక్తికరంగా మారింది.

pavan kalyan-sujeeth movie is now official..

మూవీ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌ను గమనిస్తే.. పవన్ బ్యాక్ సైడ్ నుంచి ఫొటో కనిపిస్తుంది. ఆయన ఉదయిస్తున్న సూర్యుడిని చూస్తున్నారు. పోస్టర్ అంతా ఎర్రగా కనిపిస్తుంది. అగ్ని తుపాను రానుందని, వాళ్లందరూ అతన్ని ఓజీ అని పిలుస్తారు అని కూడా పోస్టర్‌లో ఉంది. ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ (అందరికి బాస్) అని అర్థం. ఈ చిత్రం లో పవన్ గ్యాంగ్స్టర్ గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. అలాగే బ్యాక్గ్రౌండ్ మొత్తం జపనీస్ జెండా ఉంది. అంతే కాకుండా పోస్టర్ పై ఉన్న జపనీస్ వాఖ్యానికి అర్థం ఏంటంటే ‘ఫైర్ స్ట్రామ్ ఈస్ కమింగ్.’ (అగ్ని తుపాను రాబోతుంది).

pavan kalyan-sujeeth movie is now official..

అంతేకాకుండా పోస్టర్ లో మరోవైపు బుద్ధుడి ప్రతిమ కూడా కనిపిస్తోంది. బుద్ధుడు అంటే శాంతికి ప్రతీక. పోస్టర్ పై చూస్తుంటే ఫుల్ అఫ్ యాక్షన్ డ్రామా లా కనిపిస్తోంది. మొత్తానికి ఈ చిత్రం మార్షల్ ఆర్ట్స్ నేపథ్యం లో, జపాన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కే గ్యాంగ్స్టర్ డ్రామా అని పోస్టర్ ని చూస్తుంటే తెలుస్తోంది. దీంతో పవన్ ఫాన్స్ ఈ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

pavan kalyan-sujeeth movie is now official..

ఈ సినిమా మరే సినిమాకు రీమేక్ కాదని సమాచారం. ఓ ఫ్రెష్ సబ్జెక్ట్‌తో పవన్ కళ్యాణ్ సినిమా ప్లాన్ చేశారట సుజీత్. ఈ చిత్రం వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లబోతోంది. ఆర్ ఆర్ ఆర్ వంటి సెన్సేష‌న‌ల్ మూవీని నిర్మించి దేశవిదేశాల్లో క్రెడిట్ కొట్టేసిన డీవీవీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ఈ సినిమాను సర్వ హంగులతో రూపొందించనున్నారట. పవన్- సుజీత్ కాంబోలో వస్తున్న ఈ సినిమా కోసం 200 కోట్ల బడ్జెట్ కేటాయించారట దానయ్య. ఈ సినిమాకు రవి. కె.చంద్రన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలను నిర్వహించబోతున్నారు.