హరిహర వీరమల్లు.. పవన్‌ కల్యాణ్‌– క్రిష్‌ జాగర్లమూడి కాంబోలో రాబోతున్న పిరియడ్ యాక్షన్‌ అడ్వెంచర్‌ ఫిల్మ్‌. ఇలాంటి ఒక పాత్రలో పవన్‌ ఇప్పటివరకు నటించకపోవడంతో ఈ సినిమాకి మరింత క్రేజ్‌ పెరిగింది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురుచూస్తున్నారు. పైగా పవన్‌ కల్యాణ్‌ నుంచి వస్తున్న తొలి పాన్‌ ఇండియా సినిమా కూడా కావడంతో ఫ్యాన్స్‌ లో అంచనాలు మరింత రెట్టింపయ్యాయి.
క్రిష్‌ రచించి.. తెరకెక్కిస్తున్న ఈ సినిమా వచ్చే వేసవికి విడుదల అవుతుందని చెబుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా 40 శాతం షూటింగ్‌ పూర్తి చేసుకుంది. కానీ, కొన్ని రోజులుగా షూట్‌ కి బ్రేక్‌ పడటంతో సినిమా అనుకున్న సమయానికి రాదేమో అని అభిమానుల్లో టెన్షన్‌ స్టార్ట్‌ అయ్యింది. కానీ, అలాంటి అవకాశమే లేదని చిత్ర బృందం క్లారిటీ ఇస్తోంది.

Video Advertisement

pavan kalyan watch price..!!
ఇప్పటికే తర్వాతి షెడ్యూల్‌కు సంబంధించిన ప్రీ షెడ్యూల్‌ వర్క్‌ షాప్‌ కూడా నిర్వహించారు. అక్టోబరు 15 తర్వాత తర్వాతి షెడ్యూల్‌ ప్రారంభిస్తామని అతి త్వరలో సినిమా చిత్రీకరణ పూర్తవుతుందని చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు ప్రీ షెడ్యూల్‌ వర్క్‌ షాప్‌లో పవన్‌ లుక్‌ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. రెడ్‌ టీషర్ట్‌, జీన్స్‌, షూస్‌ వేసుకుని అక్కడ అటూ ఇటూ తిరుగుతూ స్టోరీ డిస్కషన్‌ చేస్తున్న పవన్‌ ని చూసి అభిమానులు మైమరచిపోతున్నారు.

pavan kalyan watch price..!!
ఆ ఫోటోలలో పవన్ కళ్యాణ్ రెడ్ కలర్ టీ షర్ట్ జీన్స్ ప్యాంట్ వేసుకొని న్యూ లుక్ లో కనిపించారు.అలాగే చేతికి వేసుకున్న వాచ్ గురించి ప్రస్తుతం అసలు మీడియాలో చర్చలు నడుస్తున్నాయి.

pavan kalyan watch price..!!

పవన్‌ కల్యాణ్‌ పెట్టుకున్న వాచ్‌ ఇటలీ సంస్థ అయిన పనేరాయ్‌ కంపెనీకి చెందింది. పనేరాయ్‌ లోని సబ్‌ మెర్సిబుల్‌ కార్బోటెక్‌ 47ఎంఎం అనే మోడల్‌ వాచ్‌ అనమాట. దాని ధర అక్షరాలా రూ.14,37,000 అనమాట.

pavan kalyan watch price..!!
అయితే వాచ్‌ ధర విషయంలో ఎలాంటి కన్ఫూజన్‌ లేకపోయినా కూడా.. పవన్‌ వేసుకున్న షూస్‌ విషయంలో మాత్రం పెద్దఎత్తున ట్రోలింగ్‌ నడుస్తోంది. పవన్‌ వేసుకున్న షూస్‌ ధర విషయంలో సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోంది. నిజానికి ఆ షూస్‌ ధర దాదాపు రూ.9,600 ఉంటాయి. అవి కోపెన్‌ హాగెన్‌ అనే కంపెనీకి చెందినవి. ఆన్‌ లైన్‌ లో వాటి ధర 119,94 యూరోస్‌ అని చూపిస్తోంది. అంటే మన కరెన్సీ దాదాపు రూ.9,600 అవుతుంది.