Ads
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటేనే అభిమానులకు పిచ్చ క్రేజ్. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది. ఆయన ఓవర్ నైట్ స్టార్ అవ్వలేదు ,జీవితం లో చాలా ఒడిదుడుకులు ఎదుర్కొని పైకి ఎదిగారు. ఆయన జీవితం …ఆయన మాటల్లోనే….తెలుసుకుందామా…..
Video Advertisement
చిన్నప్పటి నుంచి ఆస్తమా ఉండడం వల్ల తన ఎక్కువగా ఇంట్లో అల్లరి చేసే వాడిని కాదని , పెద్దగా ఫ్రెండ్స్ కూడా లేరని ఆయన పేర్కొన్నారు. తను క్లాసుల్లో ఫెయిల్ అవుతున్న తల్లిదండ్రులు ఏమి అనేవారు కాదని, కానీ తనకే తన ఫ్రెండ్స్ ని చూసి ఇబ్బందిగా ఉండేదని చెప్పారు. ఆ ఒత్తిడిలో ఆత్మహత్యా ప్రయత్నం చేసిన పవన్ కళ్యాణ్ ను అతని కుటుంబ సభ్యులు కాపాడి మేమున్నామని ధైర్యం చెప్పారు.
ఈ క్రమంలో అన్నయ్య చిరంజీవి ప్రోత్సాహంతో సినిమాల్లోకి రావడం కోసం సత్యానంద్ గారి దగ్గరకు శిక్షణకు వెళ్లాడు. మొదటినుంచి ఎంతో మొహమాటస్తుడైన పవన్ ఆయన శిక్షణలో బిడియపు గోడలను బద్దలు కొట్టగలిగాడు. కొన్నాళ్లకు సినిమా అవకాశం వచ్చినా ఎంతకీ సినిమా మొదలు కాకపోవడంతో బెంగళూరుకు వెళ్లి నర్సరీ పెట్టుకోవాలని పవన్ అభిప్రాయపడ్డారు. కానీ ఊహించని విధంగా అదే సమయానికి సినిమా ప్రారంభం అవ్వడంతో “అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి “చిత్రం ద్వారా పవన్ తెలుగు తెరకు పరిచయమయ్యాడు.
pawan-puri-jaganandh-movie-producer
“నా కెరియర్ లో ఇదే ఆఖరి చిత్రం అవుతుందని నేను భావించాను కానీ ఇంకో సినిమా చేయి అని కుటుంబ సభ్యులు ప్రోత్సహించడంతో క్రమంగా సినీ ఫీల్డ్ కు అలవాటు పడ్డాను. తర్వాత జానీ సినిమా తీసేటప్పుడు కూడా ఇక్కడితో ఆపేద్దాం అనుకున్నాను. కానీ సాధ్యపడలేదు…. “అని ఆయన ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. గోకులంలో సీత, సుస్వాగతం, తొలిప్రేమ తమ్ముడు ఇలా విభిన్న కథలతో పవన్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం ఆయన హరిహర వీరమల్లు సినిమా తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
అన్ని రంగాల మీద పట్టు సాధించాలి అన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ పారా గ్లైడింగ్ , కర్ణాటక సంగీతం, ఎలక్ట్రిక్ కోర్స్ లో డిప్లమా మరియు కంప్యూటర్ ప్రోగ్రామింగ్ వంటి ఎన్నో విషయాలలో పరిజ్ఞానం సంపాదించాడు. ఆయన మల్టీ స్టార్ కాబట్టే జనాలలో అంత క్రేజ్ సంపాదించుకున్నాడు.
End of Article