రుచిగా ఉండే పీనట్ బటర్ ని ప్రతి ఒక్కరూ ఇష్టపడుతూ ఉంటారు. అయితే ఇది కేవలం మంచి రుచి మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతగానో మేలు చేస్తుంది. పీనట్ బటర్ లో మోనో అన్ శాచురేటెడ్ ఫ్యాట్స్, ప్రోటీన్స్ వంటివి సమృద్ధిగా ఉంటాయి.

Video Advertisement

అలానే ఆకలిని వెంటనే తీరుస్తుంది. పీనట్ బటర్ మన బ్లడ్ షుగర్ ని బ్యాలెన్స్డ్ గా కూడా ఉంచుతుంది. అయితే ఈ రోజు పీనట్ బటర్ వల్ల ఎలాంటి లాభాలు పొందొచ్చు అనేది తెలుసుకుందాం.

పీనట్ బటర్ ని ఏ సమయంలో అయినా తీసుకోచ్చు. ఉదయం అల్పాహారం సమయంలో కానీ మధ్యాహ్నం కానీ లేదా స్నాక్స్ కింద కానీ తీసుకోవచ్చు. ఉదయం సమయంలో కానీ మిడ్ మార్నింగ్ టైం లో కానీ దీనిని తీసుకుంటే ఎనర్జీ ఎక్కువగా పొందొచ్చు.
పీనట్ బటర్ లో విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ ఈ ఇందులో ఎక్కువగా లభిస్తుంది. విటమిన్ ఈ హృదయ సంబంధిత సమస్యలు, క్యాన్సర్, కంటి సమస్యలు రాకుండా చూసుకుంటుంది.

పీనట్ బటర్ తీసుకోవడం వల్ల ఫ్రీ రాడికల్స్ డ్యామేజ్ నుండి ప్రొటెక్ట్ చేస్తుంది. అలాగే చర్మం అందంగా మారడానికి కూడా ఇది సహాయం చేస్తుంది. పీనట్ బటర్ లో ఉండే పొటాషియం, కండరాల నొప్పులు తగ్గిస్తుంది కూడా. అదేవిధంగా బీపీని తగ్గించడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. బీపీని తగ్గించుకోవాలి అనుకునేవారు పీనట్ బటర్ ని తీసుకునేటప్పుడు సాల్టెడ్ పీనట్ బటర్ ని తీసుకోకండి.


సాయంత్రం పూట స్నాక్స్ కింద దీన్ని తీసుకుంటే మంచి నిద్ర పడుతుంది. అయితే ఏదైనా సరే తగిన మోతాదులో తీసుకోవడం చాలా ముఖ్యం లేదు అంటే సమస్యలు వస్తాయి.