కొత్త బంగారు లోకం సినిమాతో దర్శకుడు మారిన శ్రీకాంత్ అడ్డాల సంచలన విజయం సాధించారు. ఆ తరువాత సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీతో విక్టరీ వెంకటేష్, సూపర్ స్టార్ మహేష్ బాబుతో మల్టీస్టారర్ సినిమాను  తెరకెక్కించి, విజయం సాధించారు. ఈ మూవీతోనే మల్టీస్టారర్ సినిమాలు ఊపందుకున్నాయి.

Video Advertisement

నారప్ప తరువాత ‘పెదకాపు’ అనే  సినిమాను శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించారు. ఇటీవల రిలీజ్ అయిన ఆ మూవీ ట్రైలర్ తో శ్రీకాంత్ అడ్డాల పేరు ఇండస్ట్రీలో మారుమోగిపోతోంది. సెప్టెంబర్ 29న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో బుధవారం నాడు సెలబ్రిటీల కోసం ప్రీమియర్ షో ప్రదర్శించారు. ప్రీమియర్ షో రివ్యూను ఇప్పుడు చూద్దాం..
పెదకాపు ట్రైలర్ చూసినవారంత షాక్ అయ్యారు. ఒకప్పుడు క్లాస్ చిత్రాలను తెరకెక్కించిన శ్రీకాంత్ అడ్డాల ఇలాంటి మాస్ మూవీని ఎలా తీస్తున్నారని చర్చించుకుంటున్నారు. ఈ మూవీ  రేపు విడుదల కానుంది. దాంతో రిలీజ్ కు 2 రోజుల ముందే బుధవారం నాడు సినీ సెలబ్రిటీల కోసం ప్రీమియర్ షో వేశారు. ఈ ప్రీమియర్ షోకు వెళ్ళిన సినీ సెలబ్రిటీలు, సినీ పరిశ్రమకు చెందిన కొందరు పీఆర్‌వోలు, మూవీ క్రిటిక్స్ కూడా ఈ సినిమాని చూశారట.
వీళ్లంతా సోషల్ మీడియా ఎక్స్ ద్వారా పెదకాపు సినిమా పై తమ అభిప్రాయాలను షేర్ చేసుకుంటున్నారు. మూవీ చూసిన వారంతా దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల సూపర్ కమ్ బ్యాక్ ఇచ్చారని, మూవీని రస్టిక్‌గా తీశారని కామెంట్ చేస్తున్నారు. ఈ మూవీలోని క్యారెక్టర్స్, డైలాగులు, విజువల్స్, కొన్ని సీన్స్ ఇప్పటికీ మైండ్ లో తిరుగుతున్నాయని ఒకరు ఎక్స్‌లో రాసుకొచ్చారు.

మరొకరు మాకూ ఒక వెట్రిమారన్ ఉన్నాడని అనిపిస్తోందని అన్నారు. ఇంకొకరు తెలుగులో గొప్ప కెమెరామేన్ ఉన్నారని ఛోటా కె నాయుడు తన వర్క్‌తో గుర్తు చేశారని సినీ జర్నలిస్ట్ రాసుకొచ్చారు. కొన్ని షాట్స్,  ఫ్రేమ్స్ ను  ఎంత మెచ్చుకున్నా తక్కువే అని ప్రశంసించారు. మిక్కీ జే మేయర్ ఈ మూవీకి అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారట. టెక్నీషియన్స్ అంతా బెస్ట్ వర్క్ ఇచ్చారని రాసుకొచ్చారు.

Also Read:  “ఆడియన్స్ మీద ఎటాక్ చేశారుగా..?” అంటూ… రామ్ పోతినేని “స్కంద” రిలీజ్‌పై 15 మీమ్స్..!