“చంద్రయాన్-3” సక్సెస్ వెనుక ఉన్న రియల్ హీరోలు వీరే..! ఎవరెవరు ఏ పదవిలో ఉన్నారు అంటే..?

“చంద్రయాన్-3” సక్సెస్ వెనుక ఉన్న రియల్ హీరోలు వీరే..! ఎవరెవరు ఏ పదవిలో ఉన్నారు అంటే..?

by kavitha

Ads

ఎన్నో ఏళ్ల నుండి జాబిల్లి పై అడుగుపెట్టాలనే భారత్ కల ఎట్టకేలకు నెరవేరింది. ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రయోగం చంద్రయాన్‌– 3 సక్సెస్ ఫుల్ గా చందమామ పై ల్యాండ్ అయ్యింది. ఆ క్షణం కోసం అటు ఇస్రో ఇటు 140 కోట్ల మంది ఇండియన్స్ ఆగస్ట్ 23 ఉదయం నుండే ఉత్కంఠంగా ఎదురుచూశారు.

Video Advertisement

చందమామ పై సేఫ్ ల్యాండింగ్ జరగగానే దేశవ్యాప్తంగా ఆనందం వెల్లివిరిసింది. సోషల్ మీడియాలో అంతటా జయహో భారత్, ఇస్రో శాస్రవేత్తలకు అభినందనలు తెలిపారు. చంద్రయాన్‌-3 ప్రయోగంలో చాలా మంది ఇస్రో శాస్త్రవేత్తలు పనిచేశారు. ఈ శాస్త్రవేత్తల బృందాలకు లీడర్ గా వ్యవహరించిన కీలకమైన వారి గురించి ఇప్పుడు చూద్దాం..
1. ఎస్‌ సోమ్‌నాథ్‌ భారతి – ఇస్రో సంస్థ ఛైర్మన్‌:

చంద్రయాన్‌-3 లాంచ్ చేసిన వెహికల్‌ మార్క్‌-3 రూపొందించడంలో ఎస్‌ సోమ్‌నాథ్‌ భారతి ముఖ్యమైన పాత్రని పోషించారు. 2022 జనవరిలో సోమ్‌నాథ్‌ ఇస్రో ఛైర్మన్‌గా బాధ్యతలు తీసుకున్నారు. ఇస్రో త్వరలో చేపట్టనున్న  గగన్‌యాన్‌ మిషన్ మరియు సోలార్‌ మిషన్‌ ఆదిత్య-ఎల్‌1 లను కూడా పర్యవేక్షిస్తున్నారు.

2. పీ వీరముత్తువేల్‌ – చంద్రయాన్‌-3 ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌:

వీరముత్తువేల్‌ చంద్రయాన్‌-3 మిషన్ కు ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌గా 2019లో బాధ్యతలు తీసుకున్నారు. వీరముత్తువేల్‌ పర్యవేక్షణలోనే రోవర్‌ మరియు ల్యాండర్‌ నిర్మాణం జరిగింది.
3. కె కల్పన – చంద్రయాన్‌-3 డిప్యూటీ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌:

కల్పన చంద్రయాన్‌-3 మిషన్ కు అసోసియేటెడ్‌ డైరెక్టర్‌గా పనిచేశారు. చెన్నైలో బీటెక్‌ చేసిన కల్పన, ఆ తరువాత ఇస్రోలో సైంటిస్ట్ గా జాయిన్ అయ్యారు. ఆమె చంద్రయాన్‌-2 మిషన్ లో కూడా వర్క్ చేశారు.

4. ఎస్‌ ఉన్నికృష్ణన్‌ నాయర్‌ – డైరెక్టర్‌, వీఎస్‌ఎస్‌సీ:

ఉన్నికృష్ణన్‌ నాయర్‌ ప్రస్తుతం కేరళలో విక్రమ్‌ సారాభాయ్‌ స్పేస్‌ సెంటర్‌ (వీఎస్‌ఎస్‌సీ) డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. చంద్రయాన్‌-3ని ఆకాశంలోకి తీసుకెళ్లిన ఎల్‌ఎమ్‌వీ-3ని విక్రమ్‌ సారాభాయ్‌ స్పేస్‌ సెంటర్‌ లో నిర్మించారు. ఈ నిర్మాణంలో ఉన్నికృష్ణన్‌ కీలకంగా వ్యవహరించారు.
5. ఎమ్‌ శంకరన్‌ – డైరెక్టర్‌, URSC:

శంకరన్‌ చంద్రయాన్‌-3 ప్రయోగంలో ల్యాండర్‌ శక్తిని పరీక్షించేందుకు చందమామ ఉపరితలాన్ని పోలి ఉన్న నిర్మాణాన్ని రూపొందించడంలో ముఖ్యమైన పాత్రను పోషించారు.

6. వీ నారాయణన్ – డైరెక్టర్‌, ఎల్‌పీఎస్‌సీ: 

చంద్రయాన్‌-3 మిషన్ లోని ల్యాండర్ సాఫ్ట్‌ ల్యాండింగ్‌కు కావాల్సిన థ్రస్టర్లను వీ నారాయణన్ ఆధ్వర్యంలో అభివృద్ధి చేశారు.

7. బీఎన్‌ రామకృష్ణ – డైరెక్టర్‌, ఐఎస్‌టీఆర్‌ఏసీ:

రామకృష్ణ ఐఎస్‌టీఆర్‌ఏసీ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. విక్రమ్‌ ల్యాండింగ్‌ ప్రాసెస్ లో ‘17 మినిట్స్‌ ఆఫ్‌ టెర్రర్‌’ ఇక్కడి నుండే పర్యవేక్షిస్తారు. ఈ కేంద్రంలో ఉన్న అతిపెద్ద డిష్‌ యాంటెనా సాయంతోనే సైంటిస్ట్ లు ల్యాండర్‌కు కమాండ్‌లు పంపిస్తారు.

Also Read: చంద్రయాన్-3 సక్సెస్ అవ్వడం వల్ల భారతదేశానికి కలిగే ప్రధాన ప్రయోజనాలు ఏంటో తెలుసా..?


End of Article

You may also like