బాగా ఫేమస్ అయిన “జారు మిఠాయ” పాటని ట్రోల్ చేస్తున్నారా..? ఈ విషయం ఆలోచించారా..?

బాగా ఫేమస్ అయిన “జారు మిఠాయ” పాటని ట్రోల్ చేస్తున్నారా..? ఈ విషయం ఆలోచించారా..?

by Anudeep

మంచు విష్ణు ఈ మధ్య సినిమాలు తగ్గించిన సంగతి తెలిసిందే. కాగా ఆయన చాలా గ్యాప్ తర్వాత నటించిన సినిమా ‘జిన్నా’ . జిన్నా చిత్రంలో విష్ణు సరసన బాలీవుడ్ బ్యూటీ సన్నీలియోన్ , బ్యూటీ పాయల్ రాజ్ పుత్ నటించారు. అయితే ఇందులో ”జంపులకడి జారు మిఠాయ’ సాంగ్ మంచి హైప్ ని తీసుకొచ్చింది.

Video Advertisement

ఈ సాంగ్ బేసిక్ గా ఒక జానపదం. దీనికి మంచి మ్యూజిక్ ఇచ్చి, ట్యూన్ కట్టి.. సింగర్స్ సింహా, నిర్మలా రాథోడ్ చేత పాడించారు అనూప్ రూబెన్స్. ఈ పాట మాస్ ప్రేక్షకులకు ఆకట్టకునే విధంగా ఉంది. అయితే ఈ పాట ఒరిజినల్ ను పాడిన భారతమ్మ, నాగరాజమ్మ లను ‘జిన్నా’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వెలుగులోకి తీసుకొచ్చారు మంచు ఫామిలీ. అయితే ఈ ఈవెంట్ లో వారు సాధారణం గా ఊర్లో పాడుకున్నట్లుగానే స్టేజ్ పై పాడారు. దీంతో ట్రోలర్స్ రెచ్చిపోయారు.

trolls on jampalakadi jaru mithya song from ginna movie..

ఈ మధ్యకాలంలో కొత్తగా ఎవరి టాలెంట్ బయటికి వచ్చినా ట్రోల్ చేయడం అనేది దారుణంగా అయిపోయింది. జారు మిఠాయి సాంగ్ వెనకున్న భారతమ్మ, నాగరాజమ్మలను కూడా ట్రోల్ చేయడం ప్రారంభించారు. వీరిద్దరూ కూడా ప్రొఫెషనల్ సింగర్స్ కాదు. వాళ్ళు పల్లెల్లో పాడుకునే జానపదాలను, వాళ్ళంతట వారే క్రియేట్ చేసిన పాటలు అవి. వారు పాడిన విధానం బాగుందనే మంచు ఫ్యామిలీ వాళ్ళను ఇక్కడి వరకు తీసుకొచ్చారు.

trolls on jampalakadi jaru mithya song from ginna movie..

నిజానికి పల్లె పాటలను ఎవ్వరూ ధైర్యంగా బయటికి తీసుకురావట్లేదు. తీసుకురావడానికి ప్రయత్నిస్తున్న ఇలాంటి వాళ్ళను హేళన చేయడం, ట్రోల్ చేయడం ఓ ప్యాషన్ అయిపోయింది. సినిమా పాటలకన్నా ప్రత్యేక స్థానం జానపదాలు, పల్లె గేయాలకు ఉంటుందని చెప్పాలి. పల్లె పాటలు అనేవి అదృష్టం ఉన్నవారికి మాత్రమే దొరికే ఆణిముత్యాల లాంటివి. జనజీవనంలో వస్తున్న మార్పులు, నాగరికత దృష్ట్యా జానపదాలు అనేవి మెల్లమెల్లగా అంతరించిపోతున్నాయి.

trolls on jampalakadi jaru mithya song from ginna movie..

తెలంగాణలో ఇప్పటికీ జానపద గేయాలకు మంచి ఆదరణ ఉంది. కానీ.. ఆంధ్రప్రదేశ్ లో జానపదాలు అనేవి అంతరించిపోయాయి. ఎక్కడో కొన్ని ప్రాంతాలు, మారుమూల గ్రామాలలోనే వినిపిస్తున్నాయి. ఇలాంటి వారు బయటకి వచ్చిన మిడిమిడి జ్ఞానం ఉన్న ట్రోలర్స్ వారికీ అడ్డం పడుతున్నారు. మనం ఎవరిని ట్రోల్ చేయాలి? ఏ విషయంలో ట్రోల్ చేయాలి? ఎంతవరకు లిమిట్స్ లో ఆగిపోవాలి? అనే అంశాలను ట్రోలర్స్ గుర్తుంచుకోవాలి అని నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు.


You may also like