పెరిల్లూర్ ప్రీమియర్ లీగ్ రివ్యూ..! ఈ సిరీస్ ఎలా ఉందంటే..?

పెరిల్లూర్ ప్రీమియర్ లీగ్ రివ్యూ..! ఈ సిరీస్ ఎలా ఉందంటే..?

by Mounika Singaluri

ఇటీవల కాలంలో ప్రేక్షకుల అభిరుచులు పూర్తిగా మారిపోయాయి. దీంతో కొందరు ప్రేక్షకులు ఓటీటీ లకే పరిమితం అవుతున్నారు. ఓటీటీ లోకి ఇటీవల కాలంలో కొన్ని సినిమాలు, వెబ్ సిరీస్ లు నేరుగా విడుదల అవుతున్నాయి.

Video Advertisement

ఇంకా చెప్పాలంటే ఇంకొన్ని సినిమాలు వెబ్ సిరీస్ లు అయితే ఎటువంటి హంగామా లేకుండా సైలెంట్గా ఓటిటిలో విడుదల అయ్యి స్ట్రీమింగ్ అవుతున్నాయి. అటువంటి వాటిల్లో పెరిల్లూర్ ప్రీమియర్ లీగ్ కూడా ఒకటి. కాగా ఈ వెబ్ సిరీస్ 7 ఎపిసోడ్స్ గా వచ్చిన విషయం తెలిసిందే. విడుదలైన ప్రతి ఒక్క ఎపిసోడ్ కూడా ప్రేక్షకులను మెప్పించింది.

new ott release review

కాగా ఈ వెబ్ సిరీస్ ప్రస్తుతం హాట్స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే. ఇకపోతే మరి ఈ వెబ్ సిరీస్ లో అసలు కథ ఏమిటి అన్న విషయానికి వస్తే.. ఈ కథ అంతా కూడా మాళవిక అనే పాత్ర చుట్టూ పెరిల్లూర్ అనే ఊరి చుట్టూ తిరుగుతుంది. మాళవిక చిన్నప్పుడే తండ్రి చనిపోవడంతో మేనమామ పీతాంబరం దగ్గర ఉంటూ 8వ తరగతి వరకూ చదువుకుంటుంది. ఆ స్కూల్ లోనే చదువుతున్న శ్రీకుంటన్ ను ఇష్టపడుతుంది. అయితే ఆ తరువాత ఆమె తన సొంత ఊరికి వెళ్లిపోవడంతో ఆమె జ్ఞాపకాలలో మాత్రమే శ్రీకుంటన్ ఉండిపోతాడు.

new ott release review

ఆ తర్వాత ఆమె పిహెచ్డి చేయడానికి అవసరమైన ప్రయత్నాల్లో ఉండగా మరోవైపు శ్రీకుంటన్ గల్ఫ్ లో జాబ్ చేస్తూ రావడంతో తన ఊరికి తిరిగి వస్తాడు. కానీ ఊహించని విధంగా వారిద్దరికీ పెళ్లి చూపులు జరుగుతాయి. అప్పుడు బాగా డబ్బు ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు శ్రీకుంటన్. ఆ తర్వాత అనుకోకుండా మాళవిక ప్రెసిడెంట్ అవ్వడం ఆ సమస్యల నుంచి ఆమె ఎలా బయటపడింది పీహెచ్డీ పూర్తి చేసిందా లేదా అనేది అసలు కథ? అలా ఈ వెబ్ సిరీస్ చివరి వరకు కూడా ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. దీనికి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ స్పందన లభిస్తోంది


You may also like

Leave a Comment