Ads
ప్రస్తుతం భారతదేశంలో చర్చలో ఉన్న విషయాల్లో ఒకటి పెట్రోల్ ధరలు. మెల్లగా పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు పెరుగుతూ వచ్చాయి. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్ ధర 100 దాటింది. ఇటీవల భోపాల్ లో ప్రీమియం పెట్రోల్ ధర ₹100 దాటడంతో ఒక వ్యక్తి పెట్రోల్ బంక్ దగ్గర ఒక చేత్తో బ్యాట్, మరొక చేత్తో హెల్మెట్ పట్టుకుని నిలబడ్డాడు. ఆ ఫోటో పెట్రోల్ ధర సెంచరీ కొట్టింది అని సంకేతం ఇస్తున్నట్లుగా ఉంది. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Video Advertisement
ఇది మాత్రమే కాదు పెట్రోల్ ధరలకు సంబంధించిన ప్రతి విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో సరదాగా, సీరియస్ గా వైరల్ అవుతున్నాయి. కరోనా తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలపై ఉన్న టాక్స్ పెరిగింది. ఏప్రిల్ 1, 2020 అంటే లాక్ డౌన్ మొదట్లో ఉన్నప్పుడు పెట్రోల్ ధర పై 37.8 రూపాయలు, డీజిల్ ధర పై 28 రూపాయల టాక్స్ ఉండేది. ఫిబ్రవరి 1, 2021 కి వచ్చేసరికి పెట్రోల్ పై టాక్స్ 52.9, డీజిల్ పై టాక్స్ 43.1 రూపాయలకి పెరిగింది.
సాధారణంగా పెట్రోల్ క్రూడ్ ఆయిల్ ద్వారా వస్తుంది అనే విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రూడ్ ఆయిల్ వేరే దేశాల నుండి మన దేశానికి వస్తుంది. అయితే ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ధర తగ్గింది. అయినా కూడా మనదేశంలో పెట్రోల్ ధరలు మాత్రం పెరుగుతున్నాయి. అందుకు కారణం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ముందు అసలు పెట్రోల్ ధరలు ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో తెలుసుకుందాం. క్రూడ్ ఆయిల్ అనేది ఇంటర్నేషనల్ ట్రేడెడ్ కమోడిటీ. అంటే ప్రపంచంలో ఎక్కడైనా సరే క్రూడ్ ఆయిల్ ధర ఒకేలాగ ఉంటుంది. మనీ కంట్రోల్ డాట్ కాం ప్రకారం ప్రకారం ఫిబ్రవరి 17వ తేదీన క్రూడ్ ఆయిల్ ధర ఒక బ్యారెల్ కి 60.31 డాలర్లు. అంటే భారత కరెన్సీ ప్రకారం 4390 రూపాయలు. ఒక్క బ్యారెల్ లో 159 లీటర్ల పెట్రోల్ ఉంటుంది.
అంటే ఒక లీటర్ కి 27.6100628931 రూపాయలు అన్నమాట. దీనిపై ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ నుండి రిఫైనరీ ఛార్జెస్ పడతాయి. ఈ ఛార్జెస్ లో రిఫైనరీ ప్రాసెసింగ్, రిఫైనరీ మార్జిన్స్, ఓఎంసి (ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ) మార్జిన్, ఫ్రైట్ కాస్ట్, లాజిస్టిక్స్ ఉంటాయి. ఈ రిఫైనరీ ఛార్జెస్ మొత్తం కలిపి ఒక లీటర్ కి 3.84 రూపాయలు పడతాయి. అంటే ఇప్పుడు ఫ్యూయల్ ప్రాసెసింగ్ అయ్యి, పెట్రోల్ పంప్ కి వెళ్తుంది.
అప్పుడు ధర 31.45 (31.4500628931) రూపాయలు అవుతుంది. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ టాక్స్ మొత్తంలో ఎక్సైజ్ డ్యూటీ, రోడ్ సెస్ కూడా యాడ్ అవుతాయి. ఈ ఛార్జెస్ లీటర్ పెట్రోల్ కి 32.98 రూపాయలు ఉంటాయి. పెట్రోల్ పంప్ డీలర్స్ కి లీటర్ పెట్రోల్ కి చెల్లించే కమిషన్ 3.67 రూపాయలు. ఇప్పుడు వాట్ కి ముందు ఫ్యూయల్ ఛార్జెస్ కి అయిన మొత్తం 68.10 (68.1000628931) రూపాయలు. దీనిని బేసిక్ ప్రైస్ అంటారు.
ఎక్కడైనా సరే బేసిక్ ప్రైస్ అనేది ఒకటే ఉంటుంది. ఆ తర్వాత వాట్ చార్జెస్ యాడ్ అవుతాయి. ఈ ఛార్జెస్ ప్రతి రాష్ట్రానికి వేరేగా ఉంటాయి. ఈ కారణంగానే ప్రతి రాష్ట్రంలోనూ పెట్రోల్ ధరలు మారుతూ ఉంటాయి. తెలంగాణలో అయితే 33.26 శాతం వాట్ ఛార్జెస్ పడతాయి. అంటే దాదాపు 25 రూపాయలు అన్నమాట. ప్రస్తుతం హైదరాబాద్ లో పెట్రోల్ ధర 93.10 రూపాయలు ఉంది. డీజిల్ ధర కూడా దాదాపు ఇలాగే కాలిక్యులేట్ చేస్తారు.
కానీ డీజిల్ ధరలో సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఛార్జ్ కొంచెం తక్కువగా పడుతుంది. అంటే డీజిల్ మీద సెంట్రల్ గవర్నమెంట్ నుండి వర్తించే ఛార్జ్ 31.83 రూపాయలు. స్టేట్ గవర్నమెంట్ నుంచి 26% వాట్ ఛార్జెస్ పడతాయి. ప్రస్తుతం హైదరాబాద్ లో డీజిల్ ధర చూసుకుంటే ప్రస్తుతం 87.20 రూపాయలు ఉంది. క్రూడ్ ఆయిల్ ధర మారినప్పుడు పెట్రోల్, డీజిల్ బేసిక్ ప్రైస్ లో కూడా మార్పులు వస్తాయి. ఇలా పెట్రోల్, డీజిల్ ధరలు కాలిక్యులేట్ చేస్తారు.
End of Article