“స్వాతంత్రం” రాకముందు హైదరాబాద్ లో ఉన్న… “పరిస్థితులని” తెలిపే 15 ఫోటోలు..! అప్పట్లో హైదరాబాద్ ఎలా ఉండేది అంటే..?

“స్వాతంత్రం” రాకముందు హైదరాబాద్ లో ఉన్న… “పరిస్థితులని” తెలిపే 15 ఫోటోలు..! అప్పట్లో హైదరాబాద్ ఎలా ఉండేది అంటే..?

by kavitha

భారత దేశానికి స్వాతంత్య్రం రాక ముందు హైదరాబాద్ రాష్ట్రం బ్రిటీష్ పాలించే భారత్ భూభాగంలో ఉండేది. 3 భాషా ప్రాంతాలతో కలిపిన రాచరిక రాష్ట్రంగా ఉండేది. వారిలో తెలుగు భాష మాట్లాడే తెలంగాణ ప్రస్తుత హైదరాబాద్‌తో సహా), మరాఠీ భాష మాట్లాడే మరాఠ్వాడా, కన్నడ భాష మాట్లాడే కొద్ది ప్రాంతం. అనగా అప్పటి హైదరాబాద్ రాష్ట్రంలో 8 తెలంగాణ జిల్లాలు, 5 మహారాష్ట్ర జిల్లాలు, 3 కర్ణాటక జిల్లాలు కలిసి ఉండేవి.

Video Advertisement

కుతుబ్ షాహీ వంశస్థుడైన ‘మహమ్మద్ కులీకుతుబ్ షా’ మూసీ నది ఒడ్డున హైదరాబాదును 1590 దశకంలో నిర్మించాడు. గోల్కొండలో వచ్చిన నీటి సమస్యకు పరిష్కారంగా తమ పరిపాలనను ఇక్కడకు మార్చారని చెబుతారు. కుతుబ్ షాహీ వంశస్థులు ఇక్కడి నుండే ఇప్పడున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్,మహారాష్ట్ర, కర్ణాటకలలోని కొన్ని ప్రాంతాలను పాలించారు.

400 ఏళ్లకు పైగా సుదీర్ఘమైన చరిత్ర ఉన్న అతి గొప్ప నగరం ‘హైదరాబాద్’. నవాబులు నిర్మించిన హైదరాబాద్ మొదట చించలం పేరుతో ఉండే చిన్న గ్రామం. అయితే 1590లో కలరా వచ్చి గోల్కొండ నగరం మొత్తం అతలాకుతలమయింది. దాంతో అప్పటి నవాబ్ కులీ కుతుబ్ షా గోల్కొండ నుంచి చించలంకి వచ్చి తాత్కాలికంగా ఇక్కడే బస చేశాడు. కలరా వ్యాధి తగ్గిన అనంతరం గోల్కొండ వెళ్ళేప్పుడు తను బస చేసినందుకు గుర్తుగా 1591లో చార్మినార్ ను నిర్మించాడు.
1594లో 4వ ఖలీఫా హజరత్, హైదర్ అలీ పేరిట ఈ నగరంను నిర్మించాడు. ఉద్యాన వనాలు, సరస్సులకు హైదరాబాద్ పేరు గాంచింది. భారతదేశానికి స్వాతంత్య్రం రాకముందే హైదరాబాద్ అన్ని రకాల వసతులు ఉన్న రాజదాని. అప్పటికే శాసనసభా భవనం, ఉస్మానియా ఆస్పత్రి, హైకోర్టు, ఉస్మానియా విశ్వవిద్యాలయం, విమానాశ్రయం వంటి అనేక సౌకర్యాలు ఏర్పడి ఉన్నాయి.

రాజ్యాంగ నిర్మాత అయిన డాక్టర్ అంబేద్కర్ పార్లమెంటు భవనం తప్ప దేశరాజధానికి కావలసిన అన్ని అర్హతలూ హైదరాబాద్‌కు ఉన్నాయని అన్నారు. అందువల్ల ఏడాదికి ఒకసారి అయినా హైదరాబాద్ లో పార్లమెంటు సమావేశాలు నిర్వహించాలని అంబేద్కర్ సూచించారు. ఆయన సూచన మేరకు రాష్ట్రపతి నిలయాన్ని బొల్లారంలో ఏర్పాటు చేశారు. 1956లో హైదరాబాద్ ఇండియాలో 5వ పెద్ద నగరంగా ఉండేది.
1956లో భాషల వారీగా రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ జరిగినపుడు, హైదరాబాద్ రాష్ట్రంలోని ప్రజలు మాట్లాడే భాషల వారిగా, తెలుగు ప్రాంతం తెలంగాణను ఆంధ్ర ప్రదేశ్‌లో, మరాఠీ ప్రాంతం మహారాష్ట్రలో, కన్నడ మాట్లాడే ప్రాంతం కర్ణాటకలో విలీనం చేశారు.అల ఆంధ్రప్రదేశ్ రాజధానిగా హైదరబాద్ ను ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత రాష్ట్ర రాజధానిగా మారింది. అయితే భారత దేశానికి స్వాతంత్య్రం రాక ముందు హైదరాబాద్ రాష్ట్రం సకల వసతులతో ఉండేది.అప్పటి హైదరాబాద్ యొక్క అరుదైన ఫోటోలను ఇప్పుడు చూద్దాం..

#1 రాష్ట్ర అశ్విక దళం హైదరాబాద్ వీధుల గుండా “లాంగర్” ఊరేగింపును (1948)hyderabad-before-independence rare photos

#2 ఫలక్‌నుమా ప్యాలెస్, హైదరాబాద్
#3 హైదరాబాద్ నగరానికి ప్రవేశ వంతెన..
#4 నిజాం వ్యక్తిగత ఏనుగు#5 మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, రాయల్ బాక్స్ నుండి (బహుశా పరేడ్ గ్రౌండ్స్ సికింద్రాబాద్‌లో) దళాల కవాతు
#6 నిజాం గార్డ్ కట్టు#7 నిజాం చౌమహేల ప్యాలెస్#8 చౌమహేల ప్యాలెస్ యొక్క డ్రాయింగ్ రూమ్..

#9 చౌమహేల ప్యాలెస్ లోపలి భాగం#10 మక్కా మసీదు#11 మోజమ్ జాహీ మార్కెట్‌ప్లేస్ భవనం#12 హైదరాబాద్ రాజకుటుంబానికి చెందిన ప్యాలెస్#13 చార్మినార్:

#14 అఫ్జల్గంజ్ లో ఉన్న సెంట్రల్ లైబ్రరీ

pictures of hyderabad before independence

#15 హైదరాబాద్ లో ఉన్న కొన్ని మిల్స్

pictures of hyderabad before independence

Also Read: “స్వాతంత్రం” రాకముందు ఉన్న… “గడ్డు పరిస్థితులని” తెలిపే 15 ఫోటోలు..! అప్పట్లో భారతదేశం ఎలా ఉండేది అంటే..?


You may also like