Home Sports Adda వైరల్ అవుతున్న “విరాట్ కోహ్లీ” ఫ్యాన్ గర్ల్ ఫోటో..! ఆమె బ్యాక్‌గ్రౌండ్‌ ఏంటంటే..?

వైరల్ అవుతున్న “విరాట్ కోహ్లీ” ఫ్యాన్ గర్ల్ ఫోటో..! ఆమె బ్యాక్‌గ్రౌండ్‌ ఏంటంటే..?

by Anudeep

టీ20 వరల్డ్ కప్ కోసం భారత జట్టు ముందుగానే ఆస్ట్రేలియా గడ్డ మీద అడుగుపెట్టింది. ఇప్పటికే మూడు వార్మప్ మ్యాచ్‌లు ఆడిన టీమిండియా.. కప్ కోసం మెరుగ్గా సన్నద్ధం అవుతోంది. వెస్ట్రన్ ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వార్మప్ మ్యాచ్ లో గెలిచిన భారత్.. రెండో మ్యాచ్‌లో ఓడింది. సోమవారం ఆస్ట్రేలియాతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో ఓటమి అంచుల్లో నుంచి బయటపడి గెలుపొందింది. ఫీల్డింగ్ విన్యాసాలతో మ్యాచ్‌ను మలుపు తిప్పిన కోహ్లి.. అందర్నీ ఆకట్టుకున్నాడు.

అయితే నెట్స్ సెషన్ ముగిశాక కోహ్లితోపాటు, ఇతర క్రికెటర్లు ఖాళీ సమయంలో సరదాగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లిని కొందరు అభిమానులు కలిసి ఫొటోలు దిగుతున్నారు. ఈ క్రమం లో ఓ అందమైన అమ్మాయి కోహ్లితో కలిసి దిగిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భారతీయురాలైన ఆ అమ్మాయి చాలా అందంగా ఉండటంతో ఆమె ఎవరా అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు.

pictures of virat kohli fan girl going viral..
విరాట్‌తో కలిసి ఫోటోలో కనిపిస్తున్న ఈ అమ్మాయి కోహ్లీకి వీరాభిమాని. ఆమె పేరు అమీషా బసేరా. ఆమె యూనివర్సిటీ ఆఫ్ క్వీన్స్‌లాండ్‌లో చదువుకుంటోంది. చదువుకుంటూనే మోడల్‌గా పని చేస్తున్న ఆమె.. బ్రిస్బేన్‌లో భారత క్రికెటర్లను కలిసింది. కోహ్లితో మాట్లాడిన అమీషా బసేరా.. ఈ సందర్భంగా అతడితో కలిసి ఫొటో దిగింది.

pictures of virat kohli fan girl going viral..

కోహ్లీతో కలిసి దిగిన ఫొటోను అమీషా సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ట్విట్టర్లో ఆ ఫొటోతోపాటు ‘ఇవాళ నా ఆరాధ్య వ్యక్తి, నా లవ్‌, నా మనిషి విరాట్ కోహ్లీని కలిశాను. థాంక్యూ సోమచ్’ అంటూ కోహ్లీని ట్యాగ్ చేసింది. అదే ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన అమీషా.. మాటలకు అందనిది అంటూ కోహ్లీతో కలిసిన సందర్భాన్ని తన ఫాలోవర్లతో పంచుకుంది. ఇంకేముంది లైకుల, కామెంట్ల వర్షం కురిసింది. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అంతేకాకుండా అమీషా ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయింది. ఈ ఫొటోను 14 వేల మందికిపైగా లైక్ చేయడం విశేషం.

pictures of virat kohli fan girl going viral..
దీంతో ఇన్‌స్టాలో ఆమె ఫాలోవర్లు గణనీయంగా పెరిగారు. కోహ్లి ఫొటోను పోస్టు చేయక ముందు ఆమెకు వెయ్యి మంది ఫాలోవర్లు ఉండగా.. ఆ తర్వాత కొద్ది గంటల్లోనే ఆమెను అనుసరిస్తోన్న వారి సంఖ్య 11 వేలు దాటింది. అమీషా బసేరా అందంగా ఉండటంతోపాటు కోహ్లీకి విరాభిమాని కావడంతో.. బహుశా విరాట్ ఫ్యాన్స్ ఆమెను కూడా ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది.

pictures of virat kohli fan girl going viral..
అప్పట్లో ఐపీఎల్‌లో ఆర్సీబీకి ఫుల్ సపోర్ట్ చేసిన దీపికా ఘోస్ అనే అమ్మాయి కోహ్లీకి విరాభిమాని. ఇప్పుడు అమీషా వచ్చి చేరిందని నెటిజన్లు చెబుతున్నారు. మొత్తానికి ఒక్క ఫొటోతో అమీషా బసేరా సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.

You may also like