పిల్లలకు పెదాలపై ముద్దు పెట్టకండి…3 కారణాలు ఇవే.! తప్పక తెలుసుకోండి.!

పిల్లలకు పెదాలపై ముద్దు పెట్టకండి…3 కారణాలు ఇవే.! తప్పక తెలుసుకోండి.!

by Megha Varna

Ads

చిన్నపిల్లలంటే ఎవరు ముద్దు చేయరు చెప్పండి..చిన్నపిల్లల్ని ముద్దు చేయడం వేరు..వారికి ముద్దు పెట్టడం వేరు..ముఖ్యంగా పిల్లలు కనపడగానే ఎత్తుకుని బుగ్గలపై,పెదవులపై ముద్దులు పెట్టేస్తుంటారు చాలామంది..దాన్ని  పిల్లలు కూడా రెఫ్యూజ్ చేయరు..అందుకు కారణం తల్లిదండ్రులే.. పిల్లలకు ముద్దులు పెట్టే విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి..ముఖ్యంగా పెదవులపై ముద్దు పెట్టడం మానేయాలి..ఎందుకు మానేయాలో ఒకసారి చదవండి..

Video Advertisement

శరీరంలో పెదవులు, నోటి విషయంలో కొన్ని బౌండరీస్ పాటించాలంటున్నారు సైకాలజిస్ట్ ఛార్లెస్ రెజ్నిక్. తల్లిదండ్రులు తమ పిల్లలపై ప్రేమతో పెదవులపై ముద్దు పెడుతుంటారు..ఇది సరైనది కాదు..దీనివలనే ఇతరులు తమ పెదవులపై ముద్దు పెట్టినప్పుడు పిల్లలు రెఫ్యూజ్ చేయరు.. అమ్మానాన్న పెడతారు కదా, కాబట్టి అది సరైనదేనేమో అనేది పిల్లల భావన..

గుడ్ టచ్ , బ్యాడ్ టచ్ అనేది పిల్లలకు చిన్నప్పటి నుండే నేర్పాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది..ఎందుకంటే అందరూ మంచి ఉద్దేశ్యంతోనే ఉంటారని చెప్పలేం..ఎవరైనా పెదవులపై ముద్దు పెట్టబోతే NO అని చెప్పడం ఇంటి నుండే అలవాటు కావలంటున్నారు రెజ్నిక్..మనుషుల ఉద్దేశ్యాలు ఏవైనప్పటికి రోజుకో కొత్త రోగం పుట్టుకొస్తున్న ఈ కాలంలో పిల్లలను ముద్దులకు దూరంగా ఉంచడమే మంచిది..పిల్లల పెదవులపై, నోటిపై పుండ్లు ఏర్పడడానికి, రకరకాల ఇన్పెక్షన్లు , అలెర్జీలు రావడానికి ఈ ముద్దులే ప్రధాన కారణం అనేది ఎంతో మంది డాక్టర్ల ఆరోఫణ..కాబట్టి పిల్లల ఆరోగ్య రిత్యా, మానసికంగా వారిని బలపర్చడానికి ఉపయోగపడే ఈ సూచనని తప్పక పాటించండి.


End of Article

You may also like