వైరల్ అయిన ఈ బైక్ స్టిక్కర్ చూసే ఉంటారు… కానీ ఆ బైక్ ఎవరిదంటే..?

వైరల్ అయిన ఈ బైక్ స్టిక్కర్ చూసే ఉంటారు… కానీ ఆ బైక్ ఎవరిదంటే..?

by Mohana Priya

Ads

చిరంజీవి సోదరుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి, ఇప్పుడు పవర్ స్టార్ గా గుర్తింపు పొందారు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలు ఉన్నాయి. ఈ మూడు కూడా భారీ బడ్జెట్ తో ఎక్కుతున్నాయి. ఇందులో హరిహర వీరమల్లు, ఓజి సినిమాలు రెండు భాగాలుగా రూపొందుతున్నాయి. కొంత కాలం క్రితం వరకు కూడా పవన్ కళ్యాణ్ ఈ సినిమాల చిత్రీకరణలో పాల్గొన్నారు. కానీ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం షూటింగ్స్ కి బ్రేక్ ఇచ్చారు. సార్వత్రిక ఎన్నికలు జరిగిన కారణంగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కూటమిగా ఎన్నికల్లో నిలిచారు.

Video Advertisement

pithapuram mla board designer

పిఠాపురంలో ఎమ్మెల్యే పదవికి పవన్ కళ్యాణ్ పోటీ చేశారు. అయితే గత కొంత కాలం నుండి ఒక స్టిక్కర్ వైరల్ అవుతోంది. ఈ స్టిక్కర్ మీద, “పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా” అని రాసి ఉంది. అంటే పవన్ కళ్యాణ్ తాలూకా అని ఇండైరెక్ట్ గా చెబుతున్నారు. ఈ స్టిక్కర్ వైరల్ అయ్యింది. ఎంతో మంది తమ నేమ్ ప్లేట్స్ మీద ఈ స్టిక్కర్ అంటించుకున్నారు. అయితే ఈ స్టిక్కర్ డిజైన్ చేసిన అతని పేరు నల్లా నాయుడు. ఆయన ఒక గ్రాఫిక్ డిజైనర్. అమలాపురంకి చెందిన నల్లా నాయుడు పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని.

దాంతో జూన్ 4వ తేదీ ఎన్నికల ఫలితాలు వచ్చాక తన బైక్ మీద నేమ్ బోర్డుగా ఇది పెట్టి, అప్పుడు అందరూ ఇది చూడాలి అని అనుకున్నారు. ఈ కారణంగానే ఇలాంటి ఒక బోర్డు తయారు చేసుకున్నారు. కానీ ఆ బోర్డు డిజైన్ బయటికి వచ్చేసింది. దాంతో అందరూ ఇలాంటి ఒక బోర్డు తయారు చేసుకోవడం మొదలుపెట్టారు. పిఠాపురంలో చాలా చోట్ల ఈ బోర్డు కనిపిస్తోంది. ఇప్పుడు ఎక్కడ చూసినా అదే కనిపిస్తోంది. నేమ్ ప్లేట్స్ మీద, ఆటోల మీద, ఇంకా చాలా చోట్ల ఇదే పదం కనిపిస్తోంది. దాంతో ఇప్పుడు ఇది వైరల్ గా మారింది.


End of Article

You may also like