మనింట్లో చిన్న చిన్న రిపేర్ లు వస్తూనే ఉంటాయి.. మనం చేయగలిగినవి అయితే మనమే చేసేసుకుంటాము. అలా చేయలేని వాటిని మాత్రం వర్కర్లను పిలిపించి చేయించుకుంటాము. అయితే.. అందుకు అవసరమైన వస్తువులు, రిపేర్ చేయించుకోవడానికి అయ్యే కాస్ట్ ను మనం ముందే కనుక్కుంటాము. మన బడ్జెట్ లో ఉంటె రిపేర్ చేయించేసుకుంటూ ఉంటాము.

1 plumber

ఒకవేళ మనం కాస్ట్ గురించి కనుక్కోక పోయినా.. చిన్న రిపేర్ లు అయితే మనకు ఓ అంచనా ఉంటుంది. వెయ్యి లేదా రెండు వేల రూపాయలు అవొచ్చు అని మనకి ఒక ఐడియా ఉంటుంది. అదే ఆ వర్కర్ ఏకం గా లక్షల్లో ఛార్జ్ చేస్తే..? ఆశ్చర్యం గా ఉంది కదా.. నిజం గా బ్రిటన్ లో ఆష్లే అనే కుర్రాడికి ఇలాగే జరిగింది. కిచెన్ సింక్ ను రిపేర్ చేయడానికి అతను నాలుగు లక్షల రూపాయలను డిమాండ్ చేయడం సదరు స్టూడెంట్ ని షాక్ కి గురి చేసింది.

1 sink bill

విషయం లోకి వెళ్తే.. ఆష్లే అనే 23 సంవత్సరాల కుర్రాడు ఉంటున్న ఇంట్లో సింక్ అకస్మాత్తు గా పగిలిపోవడం తో ప్లంబర్ సర్వీస్ కు కాల్ చేసాడు. ఆ తరువాత ఓ ప్లంబర్ ఇంటికి వచ్చి రిపేర్ చేయడం స్టార్ట్ చేసాడు. అయితే.. ఎంత ఖర్చు అవుతుంది అని ఆష్లే ముందే అడిగాడు. కానీ ఆ ప్లంబర్ ఏమి మాట్లాడకుండా పని చేసుకుంటూ పోతున్నాడు. వంటగది లో సింక్ పగిలిపోవడం వలన వంటిల్లు మొత్తం నీటితో నిండిపోయింది.

2 plumber

మొత్తం రిపేర్ చేసిన తరువాత ప్లంబర్ ఎంత ఛార్జ్ చేసాడో తెలుసా..? 3900 పౌండ్లు.. అంటే అక్షరాలా నాలుగు లక్షల రూపాయలు. దీనితో షాక్ అయిన ఆష్లే అంత ఎందుకు ఉంటుంది..? ముందు ఎందుకు చెప్పలేదు..? అంటూ అడిగాడు. దానికి ప్లంబర్ నా ఎక్స్పీరియన్స్ ని బట్టి నా ఇష్టం వచ్చినంత.. అవసరమైతే కోటి రూపాయలు అయినా ఛార్జ్ చేస్తాను అంటూ దబాయించాడు.

3 plumber

దీనితో ఆష్లే నీల్ డగ్లస్ అనే మరో ప్లంబర్ ను కిచెన్ సింక్ రిపేర్ కు ఎంత ఖర్చు అవుతుంది అని అడుగగా..? సదరు ప్లంబర్ పాతికవేల రూపాయల వరకు తీసుకుంటానని సమాధానం ఇచ్చాడు. ఈ విషయమై ఆష్లే ఆలోచనలో పడ్డాడు. మరో వైపు మొదటి ప్లంబర్ తనకు డబ్బు చెల్లించాలంటూ గొడవ చేస్తున్నాడు. ఈ విషయమై ఆష్లే కోర్ట్ లో కేస్ కూడా వేయనున్నాడట.