Ads
Podupu Kathalu in Telugu with Answers: పొడుపు కథలు తెలుగు : పూర్వకాలంలో ఖాళీగా ఉన్న సమయంలో పొడుపు కథలు (Podupu Kathalu)ఎవరైనా అడిగేవాళ్ళు. దానికి సమాధానం చెబుతూ ఉంటే కాలక్షేపం కూడా అయ్యేది. కాలక్షేపం కోసం అడిగే చిన్న చిక్కు ప్రశ్నలని పొడుపు కథలు అని పిలుస్తారు. ఆలోచనా శక్తి, మానసిక వికాసం, సృజనాత్మకత మరియు ఆత్మ విశ్వాసం కూడా వీటి వలన పెరుగుతుంది. మరి ఈ పొడుపు కథలని మీరు కూడా విప్పగలరో లేదో చూడండి. ఇక్కడ కొన్ని పొడుపు కథలు వాటి సమాధానాలు ఉన్నాయి మరి ఇప్పుడే ఒక లుక్ వేసేయండి.
Video Advertisement
వీటిని కూడా తప్పక చదవండి: Telugu Quotes
50+ Podupu Kathalu in Telugu with Images
1. కొత్త పెళ్లి కొడుకు బట్టలన్నీ విప్పేసి బావిలో దూకాడు కానీ మళ్లీ తిరిగి రాలేదు?
జవాబు: అరటిపండు
2. ఇల్లంతా తిరిగింది మూలన కూర్చుంది.
జవాబు: చీపురు. (cheepura)
3. దాస్తే పిడికిలిలో దాగుతుంది, తీస్తే ఇల్లంతా పాకుతుంది
జవాబు: దీపం వెలుగు
4. దేహమెల్ల కళ్లు, దేవేంద్రుడు కాను, నరవాహనము లేక నడిచిపోలేను. నాకు జీవం లేదు కానీ జీవుల్ని చంపుతాను
జవాబు: వల
5. తోక లేని పిట్ట తొంభై ఆమడలు పోతుంది?
జవాబు: ఉత్తరం
6. పొట్టి వాడికి ఒళ్లంతా బట్టలే ఎవరది?
జవాబు: ఉల్లిపాయ
7. చక్కని రాజుకు ఒళ్లంతా బొచ్చు?
జవాబు: పొలం గట్టు
8. చక్కని రాజుకు ఒళ్లంతా ముత్యాలు?
జవాబు: మొక్కజొన్న కంకి
9. వేలెడంత పిల్లోడు చీరంతా తిరిగాడు?
జవాబు: సూది (soodhi)
10. అమ్మ అంటే అందుతాయి నాన్న అంటే అందవు?
జవాబు: పెదవులు
11. ఒక సభ ఆ సభలో 32 మంది సభ్యులు అందులో ఒక నాట్యగత్తె నాట్యం వేస్తూ కనిపిస్తుంది?
జవాబు: నోరు, నోటిలో 32 పళ్ళు, నాలుక.
12. గుత్తులు గుత్తులు మామిడి గుత్తులు మధ్యాహ్నానికి మాయం అవును, ఏమిటది?
జవాబు: ఇంటి ముందు కల్లాపు
13. కొత్త పెళ్లి కొడుకు బట్టలన్నీ విప్పేసి బావిలో దూకాడు కానీ మళ్లీ తిరిగి రాలేదు?
జవాబు: అరటిపండు.
14. ముగ్గురు సిపాయిలకి ఒకటే టోపీ?
జవాబు: తాటి కాయ
15. గంపెడు చెట్లలో గుబెలు మన్నాయి?
జవాబు: ముంజు కాయలు
16. నల్ల బండ క్రింద నలుగురు దొంగలు?
జవాబు: గేదె, గేదె పొదుగు
17. నల్లని పొలం లో తెల్లని విత్తనాలు, చేత్తో చల్లుతారు నోటితో ఏరుతారు?
జవాబు: పలక అందులోని అక్షరాలు
18. చెయ్యని కుండ పొయ్యని నీరు, పెట్టని సున్నం?
జవాబు: టెంకాయ
19. కిట కిట తలుపులు కిటారి తలుపులు ఎప్పుడు మూసిన చప్పుడు కావు?
జవాబు: కళ్ళు
20. గోడమీద బొమ్మ, గొలుసుల బొమ్మ, వచ్చే పోయే వారికి వడ్డించు బొమ్మ?
జవాబు: తేలు
21. చారెడు నీళ్ళల్లో చామంతి బిళ్ళ?
జవాబు: నూనె, నూనె లో వడ
22. తనువంతా రంధ్రాలు కానీ తీయగా పాడుతాను?
జవాబు: పిల్లనగ్రోవి
23. గంపెడు శనగల్లో ఒక గులకరాయి?
జవాబు: చందమామ
24. గిన్నె, గిన్నె లో వెన్న, వెన్న లో నల్లద్రాక్ష ?
జవాబు: కన్ను
25. మా ఇంటి వెనుక ఒక గూనొడు?
జవాబు: నాగలి
26. అడవిలో అక్కమ్మ జుట్టు విరబోసుకును కూర్చుంది?
జవాబు: ఈతచెట్టు
27 . అరుగు గోడకు అరచేయి
జవాబు: పిడక
28 . కదలలేడు, కానీ కావలికి గట్టివాడు
జవాబు: తాళం
29. పాముని చంపుతాను కానీ, గ్రద్దను కాను, ఒళ్లంతా కళ్లు ఉంటాయి, కాని ఇంద్రుడుని కాను, నాట్యం చేస్తాను కానీ శివుడిని కాను, నేనెవర్ని?
జవాబు: నెమలి
30. ఒళ్లంతా ముళ్ల్లే కానీ రత్నలాంటి బిడ్డలు
జవాబు: పనస పండు
31. తోలు నలుపు, తింటే పులుపు అది ఏమిటో తెలుపు?
జవాబు: చింతపండు
32. అయ్యంటే దూరంగా వెళ్లి అమ్మంటే దగ్గరకు వచ్చేవి ఏమిటి?
జవాబు: పెదవులు
33. ఎర్రవాడొస్తే, నల్లవాడు పారిపోతాడు
జవాబు: సూర్యుడు, చీకటి
34. బంగారు చెంబులో వెండి గచ్చకాయ
జవాబు: పనసపండు గింజ
35. నూరు పళ్లు, ఒకటే పెదవి
జవాబు: దానిమ్మ పండు
36. తొడిమ లేని పండు
జవాబు: విభూది పండు
37. ఆకులేని పంట
జవాబు: ఉప్పు
38. ఒక్కటే కడుపు కానీ రెండు గుడ్లు
జవాబు: వేరుశనగ
39. నిలబడితే నిలుస్తుంది, కూర్చుంటే కూలబడుతుంది?
జవాబు: నీడ
40. సన్నని స్తంభం, ఎక్కలేరు దిగలేరు
జవాబు: సూది
41. తనను తానే మింగి, మాయమౌతుంది
జవాబు: మైనపు వత్తి
42 . కాళ్ళు చేతులు లేని తెల్లదొరకు బోలెడు దుస్తులు
జవాబు: ఉల్లిపాయ
43. కన్నులెర్రగా ఉండును రాకాసి కాదు, తల నుండి పొగ చిమ్ముంది, భూతం కాదు, పాకిపోవుచుండు పాము కాదు, ఏమిటది?
జవాబు: రైలు
44. ఇనుప ముద్దోడు కానీ ఇంటికి గట్టోడు
జవాబు: తాళం బుర్ర
45. ఎండా లేదా వానొస్తే గాని బయట అడుగుపెట్టనిది
జవాబు: గొడుగు
46. అడ్డగోడమీద బుడ్డ చెంబు, తోసినా ఇటుపక్క పడదు, అటు పక్క పడదు
జవాబు: ఎద్దు మూపురం
47. అమ్మతమ్ముడిని కాను, కానీ నేను మీకు మేనమామను
జవాబు: చందమామ
48. కొమ్ములుంటాయి కానీ ఎద్దు కాదు. అంబారీ ఉంటుంది కానీ ఏనుగు కాదు?
జవాబు: నత్త
49. పైన చూస్తే పండు, పగులగొడితే బొచ్చు
జవాబు: పత్తి కాయ
50. దోసెడు ఇంట్లో, మూరెడు కర్ర?
జవాబు: కుండలో గరిటె.
51. నాలో దేశాలు ఉంటాయి కాని మనుషులు ఉండరు, సముద్రాలు ఉంటాయి కాని నీల్లు ఉండవు, రోడ్లు ఉంటాయి కాని వాహనాలు ఉండవు, ఎవరు నేను?
జవాబు: ప్రపంచ పటము.
52. పొట్టివానికి పుట్టెడు అంగీలు.
జవాబు: ఉల్లి గడ్డ
End of Article