తమిళ లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన ప్రెస్టీజియస్ హిస్టారికల్ మూవీ ‘పొన్నియిన్ సెల్వన్-1’ బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలిచినా విషయం తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. ఈసినిమా సూపర్ హిట్ ను అందించడమే కాకుండా.. భారీ కలెక్షన్స్ ను అందుకుంది. దాదాపు 450 కోట్లకు పైగా వసూలు చేసింది.
Video Advertisement
నిజానికి ఈసినిమాను ముందు ఒకే సినిమాగా రిలీజ్ చేద్దామని అనుకున్నారు. కానీ ఆ తరువాత రెండు పార్ట్ లుగా రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఇక ఈ సినిమాకు సీక్వెల్‌గా పొన్నియిన్ సెల్వన్ 2 ని కూడా రెడీ చేశాడు మణిరత్నం. ఈ మూవీ రిలీజ్ టైం దగ్గరపడుతున్న విషయం తెలిసిందే. ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానున్న నేపథ్యంలో టీం ప్రమోషన్స్ తో ఫుల్ బిజీగా ఉంది.
ఇక మరో వైపు ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్‌తో, అప్డేట్స్ తో ఈ మూవీ పై బజ్ పెరిగిపోతోంది. ఈ సినిమాను చూసిన సెన్సార్ జ్యూరీ ఈ సినిమాకు యూ/ ఏ సర్టిఫికేట్ ను మంజూరు చేసిందట. కొన్ని కట్స్ మినహా అంతా ఓకే చెప్పిందని సమాచారం. ఈ మూవీ విజువల్ వండర్ లా ఉందని సెన్సార్ సభ్యులు చెప్పినట్లు తెలుస్తోంది. అలాగే ఈ మూవీ రన్ టైం కూడా లాక్ అయినట్లు సమాచారం.
పొన్నియిన్ సెల్వన్ 2 మూవీ 2 గంటల 44 నిమిషాల 49 సెకన్లు (164.49 నిమిషాలు) అంటే మొదటి భాగం కంటే కొన్ని నిమిషాలు తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. లైకా ప్రొడక్షన్స్ మరియు మద్రాస్ టాకీస్ సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ 5 భాషల్లో ప్రేక్షకుల ముందుకి రానుంది. చోళ సామ్రాజ్య చక్రవర్తి సుందర చోళుడితో పాటు అతడి కుమారులు కరికాల చోళుడు, పొన్నియన్ సెల్వన్ జీవితాల నేపథ్యంలో హిస్టారికల్ యాక్షన్ డ్రామాగా దర్శకుడు మణిరత్నం ఈ సినిమాను తెరకెక్కించారు.