వరుణ్ తేజ్ హీరోగా..శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం ‘ముకుందా’. సినిమాతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన ‘పూజ హెగ్డే’..స్టార్ హీరోయిన్ గా ఎదగడానికి ఎక్కువ కాలం పట్టలేదు..దువ్వాడ జగన్నాథం,అరవింద సమేత,ఆలా వైకుంఠపురం వంటి హిట్టు సినిమాలతో అందనంత ఎత్తుకు ఎదిగారు.

Video Advertisement

ప్రస్తుతం టాలీవుడ్ లో గోల్డెన్ లెగ్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది..ఇటు టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా అమ్మడు బిజీ గా ఉంది…ప్రస్తుతం చేతిలో చాల సినిమాలే ఉన్నాయి.లాక్ డౌన్ కారణంగా షూటింగ్స్ అన్నిటికి వాయిదా పడటంతో ఇళ్లకే పరిమితం అయిన మన స్టార్లు..అభిమానులతో సోషల్ మీడియా ఖాతాల ద్వారా అభిమానులకి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తుంటారు..తమ చిన్న నాటి ఫోటోలని ఆలా నాటి జ్ఞాపకాల్ని అభిమానులకి షేర్ చేస్తూ వారిని హ్యాపీ చేస్తూ ఉంటారు.

ఇటీవలే ఇంస్టాగ్రామ్ అకౌంట్ నుంచి తన చిన్న నాటి ఫోటో ని ఒకటి షేర్ చేసారు దానికి ROFL క్యాప్షన్ తో పూజ హెగ్డే..అన్న రిషబ్ హెగ్డే తో దిగిన ఫోటోలని షేర్ చేసింది ఇప్పుడు ఈ ఫోటోలు నెట్ లో వైరల్ గా మారాయి.పూజ తన చిన్న నాటి ఫొటోస్ చాల అరుదుగా పోస్ట్ చేస్తూ ఉంటారు..లాస్ట్ ఇయర్ చిల్డ్రన్స్ డే సందర్బంగా తన చిన్ననాటి ఫోటోని పోస్ట్ చేసింది పూజ హెగ్డే.పూజా హెగ్డే 2012 తమిళ చిత్రం ముగమూడితో తన నటనను ప్రారంభించారు.తరువాత ఆమె అశుతోష్ గోవారికర్ యొక్క మొహెంజో దారోతో బాలీవుడ్లో చేరింది, ఇందులో హృతిక్ రోషన్ తో కలిసి నటించింది.