కొడుకు ఆడిన ఒకే ఒక్క అబద్ధం… ఈ మహిళ జీవితాన్నే మార్చేసింది..! భర్త తనని కొట్టడంతో..?

కొడుకు ఆడిన ఒకే ఒక్క అబద్ధం… ఈ మహిళ జీవితాన్నే మార్చేసింది..! భర్త తనని కొట్టడంతో..?

by Mounika Singaluri

Ads

కోరా వెబ్ సైట్ గురించి అందరికీ తెలిసిందే. ప్రపంచంలో ఎవరు ఏ ప్రశ్న అడిగినా ప్రపంచంలో ఏదో ఒక మూల నుండి ఆ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. ఇలా ఈ ప్రశ్నలు సమాధానాల ద్వారా చాలామంది అభిప్రాయాలను, అనుభవాలను పంచుకుంటూ ఉంటారు. తాజాగా కోరాలో ఒక క్వశ్చన్ కి పూజ పండిట్ అనే ఆమె చెప్పిన సమాధానం అందరిని ఆలోచింపజేసింది.

Video Advertisement

ఇంతకీ ఆ ప్రశ్న ఏంటంటే మీ వ్యక్తిత్వాన్ని బాగా మార్చిన సంఘటన ఏది అనే ప్రశ్న అడిగారు. దానికి పూజ పండిట్ అనే ఆమె సమాధానం చెబుతూ తాజాగా తన వివాహ బంధం నుండి వైదొలిగినట్లుగా చెప్పుకొచ్చింది. దాని వెనకాల ఉన్న కారణం కూడా చెప్పింది.

ఒకరోజు తన మాజీ భర్త తనని ఇష్టం వచ్చినట్టు కొట్టి తన కోపమంతా చూపించి తర్వాత ఏమీ జరగనట్టు వెళ్లి టీవీ చూస్తూ కూర్చున్నాడట. ఇదంతా తన పక్కనే కూర్చున్న నాలుగు సంవత్సరాల చిన్నబాబు చూస్తూ ఉన్నాడంట. అతనికి ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో ఉన్నాడు. తను షాక్ కి గురై బాగా డిస్టర్బ్ అయ్యాడు. తన భర్త తనని వేధింపులకు గురి చేయడానికి గల కారణం చాలా చిన్నదని చెప్పుకొచ్చింది. అయితే తన భర్త తనని కొట్టిన తర్వాత తన బిడ్డ కళ్ళంట నీళ్లు పెట్టుకున్నాడు. ఎందుకు ఏడుస్తున్నావ్ అమ్మ అని ఆ బాబును అడిగిందట.

quora

దానికి సమానంగా ఆ బాబు ఏమీ లేదమ్మా నాకు కంట్లో ఏదో పడింది దాన్ని తీసుకోవడానికి ప్రయత్నిస్తుంటే నీళ్లు వస్తున్నాయని సమాధానం చెప్పాడట. ఆ చిన్న బాబు అబద్ధం చెప్తున్నాడని తనకు తెలుసు. తనని ఇంకా బాధ పెట్టడం ఇష్టం తను అబద్ధం చెప్పాడు.ఒక్కసారి ఆలోచించండి ఒక నాలుగు సంవత్సరాలు చిన్న పిల్లాడు తన తల్లిని ఇంకా బాధ పెట్టడం ఇష్టం లేక అబద్ధం చెప్పాడంటే. ఆరోజు తనలో ఎన్నడు లేని మార్పు వచ్చింది. తన జీవితాన్ని తన చేతుల్లోకి తీసుకోవాలని పూజ నిర్ణయించుకుంది. తన భర్త వేధింపులు తనకే కాదు తన పిల్లవాడికి కూడా మంచిది కాదు అని డిసైడ్ అయింది.

అప్పటివరకు తన భర్త కొట్టిన, తిట్టిన, బూతులు మాట్లాడిన అన్ని తన పిల్లాడి కోసం భరించినట్లు చెప్పుకొచ్చింది. కానీ ఎవరికోసమైతే తాను అన్ని భరించిందో ఈరోజు తన బాబే బాధకు గురవుతున్నాడు. తను అవన్నీ అనుభవించడాన్ని తాను భరించలేక , తన బిడ్డకి మంచి భవిష్యత్తు ఇచ్చే బాధ్యత తనపై ఉంది కాబట్టి తన భర్త నుండి విడిపోయినట్లు చెప్పుకొచ్చింది. ఆరోజు తనలో ఎంతో మార్పు తీసుకు వచ్చిందని చెప్పుకొచ్చింది. అమాయకంగా, మెత్తగా ఉండే దానికంటే బలంగా, బోల్డ్ గా ఉండడానికి నిర్ణయించుకున్నానని తెలిపింది.

 

Also Read:అత్తింట్లో అన్ని ఉన్నాయ్ అనుకున్నా” అంటూ…కొత్తగా పెళ్లైన కూతురు తన తల్లికి పంపిన ఈ మెసేజ్ చూస్తే కన్నీళ్లొస్తాయి.!


End of Article

You may also like