Ads
సోషల్ మీడియా నేటి తరానికి దినచర్య లో ఒక భాగం అయ్యింది..ఫేస్బుక్ , ఇంస్టాగ్రామ్,ట్విట్టర్, ఇలా ప్రతి రోజు కనీసం ఒక్కసారయినా మనం అందులో తొంగి చూడక తప్పదు..మనకు సంబంధించి ఏ చిన్న విషయం అయినా మన స్నేహితులతో పంచుకోకుండా ఉండలేము..అలాగే ప్రపంచం నలుమూలన ఎలాంటి సంఘటనలు జరిగిన మనకు అతి త్వరగా చేర వేసే ఏకైక ప్లాట్ ఫామ్ సోషల్ మీడియా.
Video Advertisement
సెలెబ్రెటీల దగ్గర నుంచి…సామాన్యుల వరకు ప్రతి ఒక్కరికి సోషల్ మీడియా అవసరం ఎంతో ఉంది..దీనితో లాభాలు ఎన్ని ఉన్నాయో నష్టాలు, అవి తెచ్చే కష్టాలు కూడా అన్నే ఉన్నాయి..ఇటీవల కాలం లో సైబర్ నేరగాళ్లు మితిమీరిపోతున్నారు..అకౌంట్ లు హాక్ చెయ్యడం..వారి ప్రైవసీ కి భంగం కలిగించడం..వంటివి చేస్తున్నారు..ఐతే ఎవరో గుర్తు తెలియని హ్యాకర్లు నిన్న రాత్రి పూజ హెగ్డే అకౌంట్ ని హ్యాక్ చేసారు.
Hi guys, so I’ve been informed by my team that my insta account has been hacked and my digital team is helping me with it. Please do not accept any invitations or pass out any personal information out to the person asking. Thank you.
— Pooja Hegde (@hegdepooja) May 27, 2020
తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ అంటే దాదాపుగా 10 మిలియన్ ఫాలోవర్స్ ఉన్న పేజీ ని..హ్యాకర్లు గుప్పిట్లో కి తెచ్చుకుని సమంత మీద వివాదాస్పద పోస్ట్లు తన ఇంస్టాగ్రామ్ స్టోరీ ద్వారా పోస్ట్ చేసారు..ఇది తెలిసిన పూజ హెగ్డే హుటా హుటిన తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా సమాధానం ఇచ్చుకునే ప్రయత్నం చేసారు..’నా అకౌంటును ఎవరో హ్యాక్ చేశారు.. కాబట్టి ఆ అకౌంట్ నుంచి వచ్చే ఇన్విటేషన్స్ ను ఎవరూ పట్టించుకోకండి..ఎలాంటి వ్యక్తిగత సమాచారాన్ని అందించకండి అంటూ ట్వీట్స్ చేసారు…గతం లో ఇలాంటి సంఘటనలు సెలెబ్రెటీలకు చాలా సార్లు ఎదురయ్యాయి..
కొంతమంది నెటిజెన్స్ ఈ విషయంపై పలు కామెంట్స్ చేస్తున్నారు. అయ్యో పూజా సమంతను అలా అనేసావు ఏంటి? అంటున్నారు. నిజంగానే హాక్ అయ్యిందా అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఈక్రమంలో సోషల్ మీడియాలో కొన్ని మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి. అవి ఓ లుక్ వేసుకోండి.
End of Article