సీరియల్స్.. అనగానే మనకు గుర్తొచ్చేది మన ఇంట్లో ఆడవాళ్లు.. ఎందుకంటే.. వారే ఎక్కువ గా సీరియల్స్ చూస్తూ ఉంటారు. ఇంకా రిటైర్ అయ్యి ఖాళీగా ఇంట్లో ఉన్న మగవారు కూడా కాలక్షేపం కోసం సీరియళ్లు చూస్తూ ఉంటారు. యూత్ మాత్రం ఈ సీరియళ్లకు కొంచం దూరంగానే ఉన్నా.. సీరియల్స్ కి ఉండే ఫాలోయింగ్ తక్కువేమీ కాదు..

ఇప్పుడంటే..ఇన్ని ఛానెల్స్ వచ్చాయి.. రకరకాల సీరియల్స్ ప్రసారం అవుతున్నాయి. అయితే.. ఒకప్పుడు సీరియల్స్ అంటే ఈటివి లోవే. ఈటివి లో ప్రసారం అయ్యే సీరియల్స్ కు అప్పట్లో ఓ రేంజ్ లో ఫాలోయింగ్ ఉండేది. అవేంటో.. ఆ సీరియల్స్ లో యాక్టర్స్ ఇప్పుడు ఏమి చేస్తున్నారో.. ఓ లుక్ వేసేద్దాం..

1. లేడీ డిటెక్టీవ్:

1 lady detective
ఈ సీరియల్ అప్పట్లో సెన్సేషన్ సృష్టించింది. ప్రతి గురువారం రాత్రి సమయం లో ఈ సీరియల్ ప్రసారం అయ్యేది. సినీ దర్శకుడు వంశి ఈ సీరియల్ కు దర్శకత్వం వహించారు. ఈ సీరియల్ లో హీరోయిన్ గా నటించిన ఉత్తర అప్పట్లో ప్రేక్షకులకు ఎంతగానో కనెక్ట్ అయ్యారు. ఆ తరువాత ఆమె వివాహం చేసుకుని సంసార జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు.

2. స్నేహ:

2 snehaఈ సీరియల్ కూడా అప్పట్లో ఆడవారికి బాగా కనెక్ట్ అయింది. ఈ సీరియల్ లో ప్రధాన పాత్ర పోషించిన కావేరి ప్రస్తుతం సంసార జీవితాన్ని గడుపుతున్నారు.

3. అన్వేషిత:

3 anveshita
అప్పట్లో బాగా పోపులర్ అయినా సీరియళ్ళలో అన్వేషిత ఒకటి. కొందరు టీనేజీ పిల్లలు కూడా అప్పట్లో ఈ సీరియల్ ని ఫాలో అయ్యేవారు. ఓ మంచి థ్రిల్లర్ కథతో ఈ సీరియల్ ను నడిపించేవారు. ఈ సీరియల్ దాదాపు రెండు సంవత్సరాల పాటు ఈ సీరియల్ ప్రసారం అయింది. ఈ సీరియల్ లో హీరోయిన్ గా నటించిన యమునా పలు సీరియల్స్ లో నటించి తెలుగు ప్రేక్షకులకు అభిమాన నటి అయిపోయారు.

4. అంతరంగాలు:

4 antharangalu
ఈటీవీ లో ప్రసారం అయ్యి పాపులర్ అయిన సీరియళ్ళలో అంతరంగాలు సీరియల్ ఒకటి. ఈ సీరియల్ ను రామోజీ రావు తనయుడు సుమన్ డైరెక్ట్ చేసారు. రామోజీ రావు గారు ఈ సీరియల్ ను నిర్మించారు. శరత్ బాబు, అచ్యుత్, కల్పనా ఈ సీరియల్ లో ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సీరియల్ లో నటించిన ఆ తరువాత పలు సీరియల్స్ లో కూడా నటించారు. కల్పనా ప్రస్తుతం బుల్లితెరకు, వెండితెరకు దూరం గా ఉంటూ ఫామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారు.

5. ఎండమావులు:

enda mavulu
ఈ సీరియల్ కి కూడా సెపరేట్ ఫాలోయింగ్ ఉండేది అప్పట్లో. ఈ సీరియల్ లో పలువురు సినిమా యాక్టర్లు నటించారు. మహర్షి, జ్యోతి రెడ్డి ఈ సీరియల్ లో లీడ్ రోల్ పోషించారు. మహర్షి ఇప్పటి వరకు 175 సినిమాలలో ఆర్టిస్ట్ గా పని చేసారు. అప్పట్లో ఈ సీరియల్స్ కి ఓ రేంజ్ లో ఫాలోయింగ్ ఉండేది మరి. ఆ రోజుల్లో మీరు ఫాలో అయినా సీరియల్ ఏదైనా ఉంటె.. అది కూడా కింద కామెంట్స్ లో మాతో పంచుకోండి..