గర్భగుడి వెనుక భాగంలో ఇంత శక్తి ఉంటుందా..అదేంటో మీకు తెలుసా..!!

గర్భగుడి వెనుక భాగంలో ఇంత శక్తి ఉంటుందా..అదేంటో మీకు తెలుసా..!!

by Sunku Sravan

Ads

మన దేశంలో ఎన్నో ఆచారాలు ఉంటాయి. భిన్న సంస్కృతులూ ఉంటాయి. ముఖ్యంగా హిందువులు ప్రకృతిలో ఉండే అన్నింటినీ పూజిస్తారు. ఇలాంటి ఆచారాల వల్లే ప్రపంచ దేశాలు మన దేశాన్ని గౌరవిస్తాయి. అయితే మన ఆలయాల గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. భక్తికి, ప్రశాంతతకు నిలయంగా ఉంటాయి. ఆ నిలయానికి వెళ్లే ప్రతి భక్తుడి మనసు ప్రశాంతంగా ఉంటుంది. సాధారణంగా భక్తులు తరచుగా గుడికి వెళ్తుంటారు. గుడిలో ధ్వజ స్తంభం దగ్గర నుంచి గుడి వెనుకగా ప్రదక్షినలు చేస్తారు.

Video Advertisement

గుడిలో ఉన్న చిన్నచిన్న ఉపాలయాలను కూడా దర్శించు కుంటారు. అయితే ఆ సమయంలో గుడి వెనక చాలా మంది మొక్కుకుంటూ ఉంటారు. దీని వెనుక ఉన్న విశేషం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. గుడికి వెళ్ళిన భక్తులు చాలామంది గుడి వెనుక ఉన్న భాగాన్ని సైతం మొక్కుకుంటారు. ఇలా ప్రతి ఒక్క ఆలయంలో భక్తులు ఇలా ఆచరిస్తారు.

ఇవి కూడా చదవండి: అన్నిరోజులు బంధించినా…రావణుడు సీతను ముట్టుకోలేదు..! ఎందుకో తెలుసా.? కారణం “రంభ”

temple back side

అయితే దాని వెనుక ఉన్న రహస్యం మాత్రం ఎవరికీ తెలియదు. ఏదో ప్రాచీన కాలం నుండి అలా నడుస్తూ వస్తుంది కాబట్టి ఆచారం కొద్దీ అలా ఆచరించి వెళ్ళిపోతారు. ఇంకొద్ది మంది మాత్రం మంచి జరుగుతుందనే అభిప్రాయంతో అలా చేస్తుంటారు. అంతే తప్ప దాని వెనుక ఉన్న రహస్యం మాత్రం తెలియదు. అలా మొక్కడం వెనుక ఓ బలమైన కారణం ఉందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

గుడిలో మూలవిరాట్ ఉండే గర్భాలయం ప్రశస్తమైంది. గర్భాలయంలో మూలవిరాట్టు ని గోడల మధ్యగా కాకుండా వెనుక గోడకు దగ్గరగా ప్రతిష్టిస్తారు. పూజలో నిత్యం మంత్రాచ్ఛరణ చేయడంవల్ల భగవంతుని పాదపీఠం కింద ఉన్న ఈ యంత్రంలోకి మంత్ర శక్తి ప్రవేశిస్తుంది. దీంతో ఆ విగ్రహానికి ఓ ఆకర్షణ ఏర్పడుతుంది. ఆ మంత్ర శక్తి వల్లే భగవత్ విగ్రహం నుంచి తపః కిరణాలు నాలుగు దిక్కుల ప్రసరిస్తాయి.

ఈ మంత్ర శక్తికి అత్యంత సమీపంగా ఉండేది గర్భాలయంలో వెనకవైపు గోడ. అందుకే ఆ గోడకు శిల్పాన్ని చెక్కి ఉంచుతారు. భక్తులు అక్కడ ఆగినప్పుడు తపశ్శక్తిని పొందడానికి వీలుగా ఉంటుంది. అందుకే తెలిసిన వాళ్ళు గుడి వెనక భాగంలో కొంత సేపు ఆగి నిలబడతారు. అక్కడ గర్భాలయం నుండి తాకే పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుందని బలంగా నమ్ముతారు.

ఇవి కూడా చదవండి: శివుడి శాపం వల్ల పార్వతి దేవి చేపలు పట్టేవాడి కూతురిగా పుట్టిందని తెలుసా..?


End of Article

You may also like