పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఎంట్రీ ఇచ్చినా.. అతితక్కువ టైంలోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. కెరీర్ స్టార్ట్ చేసి వరుసగా ఏడు సూపర్ హిట్లతో రికార్డ్ క్రియేట్ చేశాడు. ఆయన స్టార్ డమ్ గురించి, క్రేజ్ అండ్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు.
Video Advertisement
ప్రస్తుతం పవన్ అటు రాజకీయాల్లో.. ఇటు వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. పవన్ నటిస్తున్న హరిహర వీరమల్లు షూటింగ్ జరుపుకుంటోంది. అయితే పవన్ తదుపరి సినిమాకు సంబంధించి ఒక అప్డేట్ వైరల్ అవుతోంది. పవన్ సొంత కథతో ఒక సినిమా త్వరలో పట్టాలెక్కనుందని తెలుస్తోంది.
జానీ, సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలు పవన్ సొంత కథలతోనే తెరకెక్కాయనే సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. అయితే హరిహర వీరమల్లు సినిమా తర్వాత పవన్, హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నట్లు తెలుస్తుంది. కాగా ‘గబ్బర్‌సింగ్’ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో ‘భవదీయుడు భగత్‌సింగ్’ తెరకెక్కాల్సి ఉంది. మైత్రీ సంస్థ అధికారికంగా ప్రకటించిన ఈ ప్రాజెక్ట్ పలు కారణాల వల్ల ఆగిపోయింది.
తాజాగా పవన్, హరీష్ శంకర్‌తో సినిమా చేయడానికి సిద్ధమయ్యాడట. అయితే ముందుగా అనుకున్న కథ కాకుండా కొత్త కథతో సినిమా తెరకెక్కించనున్నారట. అంతే కాకుండా ఈ సినిమాకు పవన్ కళ్యాణ్ స్వయంగా కథను అందించనున్నాడట. దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.