టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అలానే సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా. వీరిద్దరి కాంబో లో ఓ సినిమా రావాలని అభిమానులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. అసలు మల్టీ స్టారర్ సినిమా అంటేనే ఆ కిక్ వేరే లెవెల్ లో ఉంటుంది. అందులోనూ.. పవన్, మహేష్ వంటి స్టార్ లు అంటే ఆ ఎక్సపెక్టషన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో చెప్పలేం.

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా తో మొదలైన మల్టీ స్టారర్ హంగామా ఇంకా కొనసాగుతోంది. అయితే, సరైన పెయిర్ తో సినిమా చేయడం లేదని కొందరు ఫీల్ అవుతున్నారట. అయితే, రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ కు మాత్రం ఇందులో మినహాయింపు. చెర్రీ, తారక్ ల కాంబో తో వస్తున్న సినిమా కోసం దేశమంతా ఎదురు చూస్తోంది. ఇదే తరహా లో సరైన స్టార్ కాంబో తో సినిమా రావాలని టాలీవుడ్ సినీ అభిమానులు కోరుకుంటున్నారు. ఆ కాంబో లో పవన్- మహేష్ కాంబో కూడా ఒకటి.

pavan mahesh 3

అసలు వీరిద్దరి కాంబో లో ఎనిమిది సంవత్సరాల క్రితమే సినిమా రావాల్సి ఉందట. దర్శకుడు మెహర్ రమేష్ నే వీరి కాంబో తో సినిమా తీయడానికి ట్రై చేసాడట. ‘బిల్లా సినిమా టైం లోనే వీరిద్దరిని పెట్టి మెహర్ రమేష్ సినిమా తీయాలనుకున్నాడు. మెహర్ పవన్, మహేష్ లతో చాలా సన్నిహితం గా ఉంటాడు. మెహర్ రమేష్ పవన్ కు వరుసకు తమ్ముడు అవుతాడన్నది మనకు తెలిసిన విషయమే. అలానే, సూపర్ స్టార్ మహేష్ కి మెహర్ బెస్ట్ ఫ్రెండ్.

pavan mahesh 2

ఇప్పటికే మహేష్ బాబు బిజినెస్ వ్యవహారాలన్నీ మెహర్ నే చూసుకుంటాడట. అప్పట్లో మెహర్ రమేష్ చెప్పిన స్టోరీ లైన్ ఇద్దరు స్టార్ లకు కనెక్ట్ అయిందట. ఇద్దరు పాజిటివ్ గా నే రెస్పాండ్ అయ్యారట. కానీ, శక్తీ సినిమా, షాడో సినిమాల రిజల్ట్ వచ్చాక ఈ ప్రాజెక్ట్ వెనక్కి వెళ్లిందట. ఒకవేళ, అప్పుడు అన్ని అనుకున్నట్లే అయి ఉంటె.. పవన్ – మహేష్ కాంబో లో ఎనిమిదేళ్ల క్రితమే సినిమా వచ్చి ఉండేదేమో.