రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా వరుస చిత్రాలలో నటిస్తూ, దూసుకుపోతున్నాడు. బాహుబలి, సాహో చిత్రాలతో తెలుగులో మాత్రమే కాకుండా ఇతర భాషల్లో కూడా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాడు. ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రాలన్నీ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి.

Video Advertisement

పలు సినిమాలను లైన్ లో పెట్టిన ప్రభాస్ షూటింగ్స్ తో చాలా బిజీగా ఉన్నాడు. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్ మూవీ సెప్టెంబర్ 28న రిలీజ్ కానుంది. ఈనెల 7న ఈ మూవీ ట్రైలర్‌ రిలీజ్‌ కానుంది. తాజాగా ప్రభాస్ ఆధార్ కార్డ్ నెట్టింట్లో వైరల్ గా మారింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
రెబల్ స్టార్ ప్రభాస్ వరుస పాన్ ఇండియా సినిమాలలో నటిస్తున్నారు. వీటిలో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరెక్కిస్తోన్న ‘సలార్’ సినిమా పై పాన్ ఇండియా వైడ్ గా విపరీతమైన బజ్ ఉంది. ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీ మొదటి భాగం సలార్: సీస్‌ఫైర్’‌ ను ఈనెల 28న రిలీజ్ కానుంది. ఈ మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి.
prabhas మరో వైపు ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ‘కల్కి 2898ఏడీ’ సినిమా పై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ తో అంచనాలను పెంచేశారు. ఈ చిత్రంలో ప్రభాస్ పక్కన హీరోయిన్ గా బాలివుడ్ బ్యూటీ దీపికా పదుకొనే నటిస్తోంది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లాంటి లెజెండరీ యాక్టర్స్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రభాస్ కు సంబంధించిన న్యూస్ ఏదైనా సరే క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంటుంది.
తాజాగా ప్రభాస్ కు సంబంధించిన ఒక వార్త వైరల్ గా మారింది. అది ఏమిటంటే, ప్రభాస్ ఆధార్ కార్డ్. ఈ కార్డ్ లో ప్రభాస్ పేరు ఉప్పలపాటి వెంకట సూర్యనారాయణ ప్రభాస్ అని ఉంది.  ప్రభాస్ ఫోటో కూడా గుర్తించలేనట్టుగా ఉంది. ప్రస్తుతం ఈ ఆధార్ కార్డ్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.

Also Read: “ఈ 2 సీన్స్ పెట్టడం అవసరమా..?” అంటూ… “ఖుషి” పై కామెంట్స్..!