బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు ప్రభాస్. ప్రస్తుతం ‘ఆదిపురుష్’ ‘సలార్’ ‘ప్రాజెక్ట్ కె’ వంటి పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ క్షణం తీరక లేకుండా గడుపుతున్నాడు. బాహుబలి తర్వాత వచ్చిన ‘సాహో’ ‘రాధే శ్యామ్’ సినిమాల ఫలితాలు అభిమానులను నిరాశపరిచాయి. దీంతో ప్రభాస్ ఫాన్స్ ఒక సూపర్ హిట్ కోసం వెయిట్ చేస్తున్నారు.

Video Advertisement

 

అయితే ఇటీవల విడుదల చేసిన ఆదిపురుష్’ టీజర్ కూడా ప్రభాస్ అభిమానులను ఆకట్టుకోలేకపోయింది. అది చిన్న పిల్లల సినిమా అని, బొమ్మల సినిమా అని, గ్రాఫిక్స్ చాలా నాసిరకంగా ఉన్నాయని తిట్టిపోశారు నెటిజన్లు. మరోవైపు ప్రభాస్ కోలీవుడ్ సూపర్ హిట్ డైరెక్టర్ తో తదుపరి సినిమా చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి

prabhas next film with lokesh kanagaraj..

‘ఖైదీ’ ‘మాస్టర్’ ‘విక్రమ్’ వంటి చిత్రాలతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్లు అందుకున్న లోకేష్ కనగరాజ్ ప్రభాస్ కు ఓ కథ వినిపించాడట. ఇది ప్రభాస్ కు ఎంతో నచ్చిందని వినికిడి. దీంతో వెంటనే ప్రభాస్.. లోకేష్ తో పని చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టు తెలుస్తోంది. తన సినిమా ప్రమోషన్ కోసం హైదరాబాద్‌కు వచ్చిన సదరు దర్శకుడు రెబెల్ స్టార్‌కు ఈ కథను వినిపించాడని తెలుస్తోంది. డీవీవీ దానయ్య ఈ ప్రాజెక్టుని నిర్మించే అవకాశాలు ఉన్నాయి.

prabhas next film with lokesh kanagaraj..

ఇదిలా ఉండగా.. లోకేష్ కనగరాజ్ త్వరలోనే విజయ్‌తో మరో సినిమా చేయబోతున్నాడు. అలాగే, ధనూష్ హీరోగా మరో ప్రాజెక్టును కూడా లైన్‌లో పెట్టుకున్నాడు. ఆ తర్వాత ‘ఖైదీ 2’ మొదలవుతుంది అని అంటున్నారు. ఇప్పుడేమో అతడు టాలీవుడ్ స్టార్లపై ఫోకస్ చేయడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.