ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అంటే తెలియని ఇండియన్ ప్రేక్షకులు లేరు. ప్రభాస్ ఇండియాలోనే టాప్ మోస్ట్ హీరోలలో ఒకరు. ఈశ్వర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ప్రభాస్ బాహుబలి చిత్రం తో పాన్ ఇండియా స్టార్ గా మారారు. ఈయనకు ఉన్న క్రేజ్ మరే హీరోకు లేదు. అయితే బాహుబలి తర్వాత వచ్చిన సాహో, రాధేశ్యామ్ చిత్రాలు ప్లాప్ అయ్యాయి. దీంతో ప్రభాస్ అభిమానులు అతడి తదుపరి చిత్రాల కోసం ఎదురుచూస్తున్నారు.

Video Advertisement

బాహుబలి తర్వాత ప్రభాస్ హీరోగా వస్తున్న అన్ని సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో వందల కోట్లతోనే తెరకెక్కుతున్నాయి. నిర్మాతలు కూడా ప్రభాస్ పై అంత బడ్జెట్ పెట్టడానికి ముందుకు వస్తున్నారు. మరే హీరోకు కూడా ఇంత బడ్జెట్ పెట్టడానికి రావడం లేదు కానీ. ప్రభాస్ కు మాత్రం పోటీ పడి మరి వందల కోట్లతో సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నారు. సినిమాలు కొంచెం అటు ఇటు అయినా నాన్ థియేట్రికల్ బిజినెస్ తో గట్టెక్కొచ్చని నిర్మాతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇప్పుడు ప్రభాస్ అప్ కమింగ్ చిత్రాలేవో చూద్దాం..

#1 సలార్

కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ‘సలార్’ చిత్రం చేస్తున్నాడు ప్రభాస్. ఈ సినిమాను హోంబళ్లే ప్రొడక్షన్ బ్యానర్ పై విజయ్ కిరగందుర్ నిర్మిస్తుండగా.శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమా కోసం 200 నుండి 250 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారట. ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకి రానుంది.

prabhas upcoming movies list..

 

#2 ఆదిపురుష్

రామాయణం ఆధారం గా తెరకెక్కుతున్న ‘ఆదిపురుష్’ చిత్రం లో రాముడిగా కనిపించనున్నాడు ప్రభాస్. ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ కు జోడీగా జానకి పాత్రలో కృతి సనన్ నటిస్తుంది.లంకేశ్వరుడు రావణాసురిడిగా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. ఈ సినిమా కోసం టి సిరీస్ సంస్థ 500 కోట్ల ఖర్చు చేసినట్టు టాక్. ఈ చిత్రం కూడా 2023 లో ప్రేక్షకుల ముందుకి వచ్చే అవకాశం ఉంది.

prabhas upcoming movies list..

#3 ప్రాజెక్ట్ కే

నాగ్ అశ్విన్ దర్శకత్వం లో ప్రభాస్ చేస్తున్న చిత్రం ‘ప్రాజెక్ట్ కే’. దీపికా పదుకొనె హీరోయిన్. ఈ సినిమాను వైజయంతీ మూవీస్ బ్యానర్ లో అశ్వినీ దత్ నిర్మిస్తున్నారు.ఇది పాన్ వరల్డ్ గా తెరకెక్కుతుంది.దాదాపు ఈ సినిమా కోసం 550 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.

prabhas upcoming movies list..

#4 రాజా డీలక్స్

డివివి బ్యానర్ పై దర్శకుడి మారుతీ తో ఒక చిత్రం చేయనున్నాడు ప్రభాస్. దీనికి ‘రాజా డీలక్స్’ అని పేరు పెట్టారు. ఇది ఒక హర్రర్ కామెడీ చిత్రం అని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది.

prabhas upcoming movies list..

#5 స్పిరిట్

అర్జున్ రెడ్డి చిత్రం దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తో స్పిరిట్’ చిత్రాన్ని చేయబోతున్నాడు ప్రభాస్. ఈ చిత్రం లో సూపర్ స్టార్ నయనతార హీరోయిన్‌గా నటిస్తుందని వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రాన్ని భూషన్ కుమార్ నిర్మిస్తున్నారు.

prabhas upcoming movies list..

#6 ప్రభాస్ – సుకుమార్

దర్శకుడు సుకుమార్ తో ప్రభాస్ ఒక చిత్రం చేయనున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రాలేదు. అయితే సుకుమార్ చెప్పిన స్టోరీ లైన్ ప్రభాస్ కి నచ్చిందని తెలుస్తోంది. అయితే ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న చిత్రాలు, సుకుమార్- అల్లు అర్జున్ చేస్తున్న పుష్ప 2 పూర్తి అయ్యాకే ఈ చిత్రం ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే నిర్మాత అభిషేక్ అగర్వాల్ మాత్రం ఈ ఇద్దరికీ భారీ ఎత్తున అడ్వాన్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది. దగ్గరదగ్గరగా ఈ చిత్రం 2024లో ప్రారంభమవుతుందేమో చూడాలి.

prabhas upcoming movies list..