OTT లోకి వచ్చిన కొత్త సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా..! ఎందులో స్ట్రీమ్ అవుతోంది అంటే..?

OTT లోకి వచ్చిన కొత్త సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా..! ఎందులో స్ట్రీమ్ అవుతోంది అంటే..?

by Mohana Priya

Ads

ప్రతివారం ఆహా ఏదో ఒక కొత్త సినిమాని ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తూ ఉంటుంది. కొన్ని డైరెక్ట్ రిలీజ్ అయ్యే సినిమాలు అయితే, కొన్ని మాత్రం థియేటర్లలో విడుదల అయ్యి మంచి టాక్ తెచ్చుకున్న సినిమాలు అయ్యి ఉంటాయి. అలా ఇటీవల విడుదల అయ్యి హిట్ అయిన ప్రసన్న వదనం సినిమా ఇప్పుడు ఆహా లో స్ట్రీమ్ అవుతోంది. సుహాస్ ఈ సినిమాలో హీరోగా నటించారు. సరికొత్త కాన్సెప్ట్ ఈ సినిమా రూపొందింది. సూర్య (సుహాస్) ఆర్జే గా పనిచేస్తూ ఉంటాడు ఒక ప్రమాదంలో తన తల్లిదండ్రులని కోల్పోతాడు. అదే ప్రమాదంలో సూర్య తలకి దెబ్బ తగులుతుంది. ఆ గాయంలో సూర్యకి ఎదుటి వ్యక్తుల ముఖాలను గుర్తుపట్టలేని డిజార్డర్ వస్తుంది. దాన్ని ఫేస్ బ్లైండ్ నెస్ డిసార్డర్ అని అంటారు.

Video Advertisement

prasanna vadanam movie review

ఒకరోజు సూర్య కళ్లెదురుకుండానే అమృత (సాయి శ్వేత) అనే ఒక అమ్మాయిని లారీ కిందకు తోసి చంపేస్తారు. సూర్యకి ముఖాలు సరిగ్గా కనబడవు. కానీ ఎవరో ఇలా చేశారు అనే విషయం మాత్రం సూర్యకి తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది అనేది కథ. సినిమా కాన్సెప్ట్ కొత్తగా అనిపిస్తుంది. టేకింగ్ కూడా బాగుంది. మధ్య మధ్యలో కొన్ని సీన్స్ అంత ఆసక్తికరంగా అనిపించవు. అవి పక్కన పెడితే, సినిమా అంతా కూడా చాలా గ్రిప్పింగ్ గా అనిపిస్తుంది. సాధారణంగా సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు అంటే ఇలాంటి ఒక స్క్రీన్ ప్లే ఉండడం అనేది ముఖ్యమైన విషయం. ఈ సినిమాలో అది ఉంది. నటీనటుల పర్ఫార్మెన్స్ లు బాగుంటాయి. వాళ్ల వల్ల ఈ సినిమా కథకి ఇంకా బలం వచ్చింది. సుహాస్ ఖాతాలో మరొక హిట్ పడింది.

డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్న సినిమాలని ఎంచుకుంటూ సుహాస్ ముందుకి వెళ్తున్నారు. ఇప్పుడు ఈ సినిమాతో కూడా అలాగే చేశారు. ముఖాలు గుర్తుపట్టలేకపోవడం అనే విషయం మీద సినిమా తీయడం అనేది చాలా కొత్తగా అనిపిస్తుంది. అసలు సూర్యకి ఎదురైన సంఘటనలో ఉన్న వ్యక్తి ఎవరు అని తెలుసుకోవడానికి ప్రయత్నించే సమయంలో సూర్య ఎలాంటి సంఘటనలు ఎదుర్కొన్నాడు అనేది కూడా చాలా బాగా చూపించారు. సెకండ్ హాఫ్ కూడా అంతే బాగా రాసుకున్నారు. సినిమాలో ముఖ్యమైన సీన్స్ ఆసక్తికరంగా తెర మీద చూపించారు.


End of Article

You may also like