తెలుగు సినిమా ఇండస్ట్రీలో పాన్ ఇండియన్ స్టార్ అనే గుర్తింపు తెచ్చుకున్న నటుడు ప్రభాస్. అప్పటి వరకు కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే ఉన్న క్రేజ్ బాహుబలి తర్వాత ప్రపంచ వ్యాప్తంగా పెరిగింది. ఇక ప్రస్తుతం ప్రభాస్ కేజీఎఫ్‌తో సంచలనం సృష్టించిన ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో సలార్ మూవీ చేస్తున్నారు.
Video Advertisement
ప్రభాస్ రేంజ్ డబుల్ అయ్యేలా సలార్ కోసం అంతా పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నారు ప్రశాంత్ నీల్. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఒకేసారి ఈ సలార్ సినిమాను రూపొందిస్తున్నారు. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా ఈ సలార్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు ప్రశాంత్ నీల్. ఈ సినిమా కోసం హై టెక్నాలజీ ఉపయోగిస్తున్న ప్రశాంత్ నీల్.. కొందరు బడా స్టార్స్‌ని కూడా రంగంలోకి దించుతున్నారట.
తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ అప్‌డేట్ వైరల్ అవుతోంది. ‘సలార్’ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా నుండి త్వరలోనే ఓ సాలిడ్ అప్డేట్ ఇచ్చేందుకు దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్లాన్ చేస్తున్నాడట. ఇక ఈ సమ్మర్ నుంచి వరుసగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్, గ్లింప్స్ వీడియోలు, కొత్త పోస్టర్‌లను మేకర్స్ ప్రకటించనున్నారట. థియేట్రికల్ రిలీజ్‌కు ముందే భారీ ఎత్తున ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తున్నారట మేకర్స్. దీంతో ప్రభాస్ ఫాన్స్ ఈ చిత్రం పై భారీ అంచనాలు పెట్టుకున్నారు.
అలాగే ఈ మూవీ లో కెజీఎఫ్ ఫేమ్ యష్ ఎంట్రీ అదుర్స్ అనిపించేలా ఉండబోతుందని తెలుస్తోంది. ఈ భారీ సినిమాలో కామియో రోల్ చేస్తున్నారట యష్. ప్రీ క్లైమాక్స్ లో రాఖీ భాయ్ ఎంట్రీ ఉంటుందని అంటున్నారు. ఇక అలాగే ఈ మూవీలో ఎన్టీఆర్ మార్క్ కూడా ఉంటుందని తెలుస్తుండటం మరింత ఆసక్తికరంగా మారింది. ఈ చిత్రంలో కనిపించకపోయినప్పటికీ వాయిస్ ఓవర్ అందిస్తూ ప్రశాంత్ నీల్- ప్రభాస్ సినిమాలో భాగమవుతున్నారట ఎన్టీఆర్. మొదటి నుంచి చివరివరకు పలుసార్లు ఎన్టీఆర్ వాయిస్ వినిపిస్తుందని సమాచారం.
ప్రభాస్ సరసన శ్రుతీ హాసన్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో ప్రభాస్ ఔట్ అండ్ ఔట్ మాస్ క్యారెక్టర్‌లో కనిపించబోతున్నారు. కె.జి.యఫ్, కాంతార వంటి చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. కె.జి.యఫ్‌తో పాన్ ఇండియా రేంజ్‌లో కలెక్షన్స్ దుమ్ము దులిపిన దర్శకుడు ప్రశాంత్ నీల్.. ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండటంతో సలార్‌పై భారీ అంచనాలున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్ 28 న విడుదల కానున్న ఈ చిత్రం కోసం ప్రభాస్ ఫాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు.